• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • ISRO SOUNDING ROCKET WHY ISRO LAUNCHES SOUNDING ROCKET WHAT IS THE USE OF IT NK

ISRO: సౌండింగ్ రాకెట్ అంటే ఏంటి... ఇస్రో దాన్ని ఎందుకు ప్రయోగించింది?

ISRO: సౌండింగ్ రాకెట్ అంటే ఏంటి... ఇస్రో దాన్ని ఎందుకు ప్రయోగించింది?

సౌండింగ్ రాకెట్ అంటే ఏంటి... ఇస్రో దాన్ని ఎందుకు ప్రయోగించింది? (image credit - ISRO)

ISRO: ఇస్రో ఏం చేసినా... ముందుగా కౌంట్ డౌన్ అవీ ఇలా చాలా హడావుడి ఉంటుంది. కానీ ఈ సౌండింగ్ రాకెట్‌ని ఎలాంటి రీసౌండూ లేకుండా ప్రయోగించేసింది. ఎందుకో తెలుసుకుందాం.

  • Share this:
    శుక్రవారం రాత్రి జరిగిందో అద్భుతం. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి... ఓ సౌండింగ్ రాకెట్... ఆకాశంలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో (ISRO) దీన్ని ప్రయోగించింది. దీన్నే RH-560 అని పిలుస్తున్నారు. ఇది... రెండు దశల రాకెట్... ఇది... సహజమైన గాలుల్లో వచ్చే మార్పులు, ప్లాస్మా డైనమిక్స్‌పై అధ్యయనం చేయడానికి ఉపయోగపడనుంది. విజయవంతంగా రాకెట్‌ని ప్రయోగించిన సందర్భంగా... ఇస్రో... ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేసి... లాంచ్ ఇమేజెస్‌లను పోస్ట్ చేసింది. దాంతో ఈ విషయం అందరికీ తెలిసింది. వెంటనే చాలా మంది సౌండింగ్ రాకెట్టా అదేంటి... సౌండ్ చేస్తూ వెళ్తుందా అని రకరకాలుగా మాట్లాడుకున్నారు.

    సౌండింగ్ రాకెట్ అంటే:
    సౌండింగ్ రాకెట్ అనేది... ఒకటీ లేదా రెండు దశలతో ఉండే... బలమైన ప్రొపెల్లాంట్ రాకెట్లు. ఇవి భూమి పై భాగంలో ఉండే... వాతావరణాన్ని అంచనా వేస్తాయి. అలాగే సోలార్ ప్లాస్మా స్థాయిలను లెక్కలేసి చెబుతాయి. అవి ఇచ్చే డేటా ఆదారంగా... అంతరిక్ష పరిశోధనలు సాగిస్తారు. ఈ రాకెట్లు పెద్దగా ఖర్చు అవ్వవు. తక్కువ బడ్జెట్‌లోనే తయారుచేస్తారు. ప్రస్తుతం ఇస్రో దగ్గర మూడు వెర్షన్ల సౌండింగ్ రాకెట్లు ఉన్నాయి. అవి RH-200, RH-300-Mk-II and RH-560-Mk-II. ఇవి 8 నుంచి 1000 కేజీల పేలోడ్‌ను... 80 నుంచి 475 కిలోమీటర్ల వరకూ తీసుకెళ్లగలవు.


    ఇది కూడ చదవండి: Covid Vaccination: ఏపీలో మారిన కరోనా వ్యాక్సిన్ రూల్స్... కొత్త నిబంధనలు ఇవే..

    ఇస్రో 1965 నుంచి దేశంలోనే తయారుచేస్తున్న సౌండింగ్ రాకెట్లను ఉపయోగిస్తోంది. వీటి ద్వారా సాలిడ్ ప్రొపెల్లాంట్ టెక్నాలజీపై పట్టు సాధించింది. ఇస్రో సాధించిన తాజా విజయంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు