Home /News /national /

ISRO PSLV C53 MISSION WITH SINGAPORE SATELLITES SUCCESSFUL PVN

ISRO ఖాతాలో మరో విజయం..PSLV C53 ప్రయోగం విజయవంతం

PSLV-C53 ప్ర‌యోగం

PSLV-C53 ప్ర‌యోగం

PSLV-C53 : భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ (ISRO) గురువారం నిర్వ‌హించిన PSLV-C53 ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది.

PSLV-C53 : భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ (ISRO) గురువారం నిర్వ‌హించిన PSLV-C53 ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 55వ ప్ర‌యోగం. ప్ర‌యోగం విజ‌య‌వంతం కాగానే ఇస్రో శాస్త్ర‌వేత్త‌లంతా సంబురాల్లో మునిగితేలారు. ఒక‌రికొక‌రు అభినందించుకున్నారు. పీఎస్ఎల్వీ సీ-53 గురువారం సాయంత్రం 6 గంటల 2 నిముషాలకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని శ్రీహ‌రికోట‌లోని స‌తీశ్‌ధావ‌న్‌ అంత‌రిక్ష కేంద్రంనుంచి నింగిలోకి దూసుకెళ్లింది. కౌంట్ డౌన్ 26గంటల పాటు కొనసాగిన తర్వాత రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. సింగపూర్ కు చెందిన మూడు వాణిజ్య ఉపగ్రహాలను మోసుకెళ్లింది పీఎస్‌ఎల్‌వీ సీ-53.  సింగపూర్‌కు చెందిన డీఎస్‌–ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్‌–1 ఉపగ్రహాలను మోసుకెళ్లింది.

ఇది ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) యొక్క రెండవ డెడికేటెడ్ కమర్షియల్ మిషన్ వాణిజ్య మిషన్. కాగా,ఇస్రో వాణిజ్య పరంగా పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. 2016లో పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్‌ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపి చరిత్ర సృష్టించారు. వాణిజ్యపరంగా తక్కువ ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలను పంపించే సౌకర్యం వుండడంతో చాలా దేశాలు భారత్‌ నుంచే ప్రయోగాలకు మొగ్గుచూపుతున్న విషయం తెలిసిందే.
Published by:Venkaiah Naidu
First published:

Tags: ISRO

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు