ప్రకటనలు
హోమ్ / వార్తలు / ఇండియా న్యూస్ / 2019లో తీరికలేని ఇస్రో... ఎన్ని ప్రయోగాలు చేస్తుందంటే..

2019లో తీరికలేని ఇస్రో... ఎన్ని ప్రయోగాలు చేస్తుందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి 22 మిషన్లు అంటే మొత్తం 11 ప్రయోగాలు చేపట్టాలనుకుంటున్నారు. జనవరిలోనే పీఎస్ఎల్వీ-సీ44 ప్రయోగం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  • 1-MIN READ News18 Telugu
  • Last Updated :

కొత్త కొత్త ప్రయోగాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2019లో కూడా సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్దమవుతుంది. ఈ ఏడాది ఇస్రో మొత్తం 31 మిషన్లు లక్ష్యంగా పెట్టుకుంది. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి 22 మిషన్లు అంటే మొత్తం 11 ప్రయోగాలు చేపట్టాలనుకుంటున్నారు. జనవరిలోనే పీఎస్ఎల్వీ-సీ44 ప్రయోగం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అనుసంధాన కార్యక్రమాలు గత నెల 24న షార్‌లోని మొదటి ప్రయోగ వేదికపై ప్రారంభమయ్యాయి.

ప్రకటనలు

జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3 వాహక నౌక ద్వారా చంద్రయాన్‌-2 ప్రయోగం చేపట్టనున్నారు. దీని అనుసంధానం పనులు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక సమీపంలోని వ్యాబ్‌లో చురుగ్గా జరుగుతున్నాయి. ఈ ప్రయోగం ఫిబ్రవరిలో చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే అధిక వేగవంతమైన ఇంటర్నెట్ సేవల కోసం జీశాట్‌-20 ఉప్రగహాన్ని కూడ కక్ష్యలోకి పంపనున్నారు.

చంద్రుడి ఉపరితలంపై విస్తృత పరిశోధనలు లక్ష్యంగా చంద్రయాన్‌-2ను ఇస్రో చేపట్టనుంది. ఇంతవరకూ ఏ దేశం చేరుకోని చంద్రుని దక్షిణ భాగం వైపు వెళ్లడానికి ఇస్రో ప్రణాళిక వేసింది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే చంద్రునిపై వ్యర్థ రహిత అణుశక్తి మూలకాల లభ్యతపై ఇస్రో అధ్యయనం చేయనుంది. ఈ అణుశక్తి ట్రిలియన్‌ డాలర్ల విలువ చేయనుంది. ఇస్రో చంద్రయాన్‌-2లో పంపనున్న రోవర్‌ ద్వారా నీరు, హీలియం-3 జాడ కోసం చంద్రుని ఉపరితలంపై పలు నమూనాలను విశ్లేషించనుంది. ఆ మూలకాలను చంద్రుడి నుంచి భూమికి తీసుకురాగలిగే సామర్థ్యం ఉన్న దేశాలు ఈ ప్రక్రియను తమ చెప్పుచేతల్లో పెట్టుకొనే అవకాశం లేకపోలేదు. ఈ ప్రయోగంతో భారత స్థానాన్ని చంద్రయాన్‌-2 మరింత పటిష్ఠం చేయనుంది.

చంద్రునిపై ఇప్పటికే అమెరికా, చైనా, జపాన్‌, రష్యా దేశాలు తమ ప్రయోగాలతో పోటీ పడుతున్నాయి. ఇస్రో చంద్రయాన్‌-2 ద్వారా ఆర్బిటర్‌, లాండర్‌, రోవర్‌ను పంపనుంది. ఈ ప్రయోగానికి రూ.600 కోట్ల వరకు వ్యయం చేస్తున్నారు. గతనెలలో శ్రీహరికోట వేదికగా ఇస్రో ప్రవేశపెట్టిన జీఎస్‌ఎల్‌వీ - ఎఫ్ 11 ప్రయోగం విజయవంతమైంది. జీశాట్-7ఏ ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలో ఇస్రో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం ఎనిమిదేళ్ల పాటు సేవలందించనుంది.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..
Tags: ISRO , NASA
  • First Published :
ప్రకటనలు
ప్రకటనలు