జయహో ఇస్రో.. పీఎస్‌ఎల్‌వీ సీ-47 రాకెట్ ప్రయోగం విజయవంతం..

ISRO | PSLV-C47 | కార్టోశాట్-3 సహా 13 అమెరికా ఉపగ్రహాలను ఇస్రో పీఎస్‌ఎల్‌వీ సీ47 రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది.

news18-telugu
Updated: November 27, 2019, 12:40 PM IST
జయహో ఇస్రో.. పీఎస్‌ఎల్‌వీ సీ-47 రాకెట్ ప్రయోగం విజయవంతం..
రాకెట్ ప్రయోగం
  • Share this:
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ47 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఏపీలోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌‌లోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అయిన కార్టోశాట్-3 సహా 13 అమెరికా నానో ఉపగ్రహాలను నింగిలోకి పంపించారు. 26:50 నిమిషాల వ్యవధిలో ఈ 14 ఉపగ్రహాలను ఆ రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశ పెట్టారు. కాగా, కార్టోశాట్-3 ఐదేళ్ల పాటు సేవలు అందించనుంది. దీని బరువు 1625 కిలోలు.. తయారీకి రూ.350కోట్లు ఖర్చైంది. ఇదిలా ఉండగా, రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ మంగళవారం నాడు సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకుని పూజలు చేశారు.



First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>