ISRO Launches Rocket With UK Firm's 36 Satellites : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)రాకెట్ ప్రయోగాల్లో ఎంతో పురోగతి సాధించిది. గత కొన్నేళ్లుగా వాణిజ్య ప్రాతిపదికన విదేశీ ఉపగ్రహాలను కూడా రోదసిలోకి తీసుకెళుతోంది. ఇస్రో కమర్షియల్ బాట పట్టిన తరువాత అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలు, కార్పొరేట్ కంపెనీలకు చెందిన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగిస్తోంది. తాజాగా ఇస్రో మరో వాణిజ్య రాకెట్ ప్రయోగాన్ని చేపట్టింది. ఇవాళ(మార్చి26)ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి ఎల్వీఎం3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అనంతరం ఈ ప్రయోగం విజయంతమైనట్లు తెలిపారు.
ఈ రాకెట్ 43.5 మీటర్ల పొడవు, 643 టన్నుల బరువు ఉంది. బ్రిటన్ కు చెందిన వన్ వెబ్ సంస్థకు చెందిన 36 ఉపగ్రహాలను ఈ రాకెట్ ద్వారా కక్ష్యలో ప్రవేశపెడుతున్నారు. ఈ శాేటిలైట్స్ బరువు 5.8 టన్నులుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా,శనివారం ఉదయం 8:30 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ ప్రక్రియ 24:30గంటల పాటు కొనసాగింది.
Online Gaming Apps: ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్‌పై టీడీఎస్..ఏప్రిల్ 1 నుంచి అమలు..!
బ్రాడ్ బ్యాండ్ సేవలను మరింత మెరుగుపర్చడానికి జెన్- 1 కాన్స్టెలేషన్ నెట్ వర్క్ శాటిలైట్లను ప్రయోగించడానికి ఇస్రో సహకారాన్ని తీసుకుంది వన్ వెబ్ ఇంటర్నెట్ సంస్థ. బ్రిటన్ కు చెందిన నెట్ వర్క్ యాక్సెస్ అసోసియేట్స్ లిమిటెడ్ గ్రూప్ లో వన్ వెబ్ ఒకటి. అయితే ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ రెండు దశల్లో 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి బ్రిటన్ కు చెందిన వన్ వెబ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా గతేడాది అక్టోబర్ లో 23 ఉపగ్రహాలను విజయవంతగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. తాజాగా మరో 36 ఉపగ్రహాలను పంపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ISRO