All Updates: జీఎస్ఎల్‌వీ ఎఫ్11 ప్రయోగం విజయవంతం...

ISRO GSLV-F11 Carrying GSAT-7A Launch Live Update: జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌ -11 రాకెట్‌ ద్వారా క్షేమంగా గమ్యం చేరిన తరువాత జీశాట్‌ 7-ఏ ఉపగ్రహం 8 ఏళ్ల పాటు సమాచార రంగానికి సంబంధించి సేవలను అందించనుంది.

  • News18 Telugu
  • | December 19, 2018, 18:59 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED 2 YEARS AGO

    AUTO-REFRESH

    Highlights

    18:49 (IST)
    18:49 (IST)
    18:47 (IST)

    జీశాట్ 7ఏ ఉపగ్రహాన్ని సక్సెస్‌ఫుల్‌గా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు.
     

    17:3 (IST)
    17:3 (IST)

    GSLV F11 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు.


     

    17:1 (IST)

    జీఎస్‌ఎల్వీ ఎఫ్ 11 ప్రయోగం సక్సెస్ కావడంతో షార్‌లో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. 35 రోజుల్లో మరో ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలను అభినందించారు ఇస్రో చైర్మన్ శివన్.
     

    16:35 (IST)

    నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ ఎఫ్11

    16:16 (IST)

    నింగిలోకి జీఎస్ఎల్‌వీ ఎఫ్11

    జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌11 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. సాయంత్రం 4:10 నిమిషాలకు నింగిలోకి రాకెట్‌ను పంపించారు శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగం సక్సెస్ అయ్యింది. రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది.దీంతో షార్ సైంటిస్టులంతా ఆనందం వ్యక్తంచేస్తున్నారు. నెలరోజుల తర్వాత ఇస్రో మూడో ప్రయోగం చేపట్టింది. ఎయిర్ ఫోర్స్ సమాచార వ్యవస్థ కోసం పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో ఇస్రో ఈ రాకెట్‌ను రూపొందించింది. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌ -11 రాకెట్‌ ద్వారా క్షేమంగా గమ్యం చేరడంతో జీశాట్‌ 7-ఏ ఉపగ్రహం 8 ఏళ్ల పాటు సమాచార రంగానికి సంబంధించి సేవలను అందించనుంది. ఇప్పటికే ఇస్రో జీఎస్‌ఎల్‌వీ , పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా పలు సమాచార ఉప గ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది.