చంద్రయాన్-2 ప్రయోగం తర్వాత మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సిద్దమువతోంది ఇస్రో. దీనికి సంబంధించిన సన్నాహాలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇస్రో ఛైర్మన్ శివన్ కూడా ట్వీట్ చేశారు. చంద్రయాన్ 2 ఆర్బిటర్ చాలా బాగా పనిచేస్తుంద్నారు. ఆర్బిటర్‌లో 8 ఇన్స్ట్రుమెట్స్ కూడా చురుగ్గాఅవి చేయాల్సిన పని చేస్తున్నాయన్నారు. అయితే విక్రమ్ ల్యాండర్‌తో మాత్రం తమకు ఇప్పటివరకు ఎలాంటి కమ్యునికేషన్ జరగలేదన్నారు. ఇక పోతే.. చంద్రయాన్ 2 తర్వాత తమ ప్రాధాన్యత గగన్‌యాన్ మిషన్‌కే అన్నారు ఛైర్మన్ శివన్.
మానవ సహిత రోదసియాత్ర.. గగన్‌యాన్. ఈ యాత్రను 2021 డిసెంబరులో నిర్వహించనున్నారు. ముగ్గురు వ్యోమగాములతో చేపట్టే ఈ యాత్రలో భాగంగా ఒక మహిళా వ్యోమగామిని రోదసిలోకి పంపనున్నారు. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్టు ఇస్రో చీఫ్ కె.శివన్ గతంలోనే ప్రకటించారు. ఈ మేరకు వ్యోమగాముల ఎంపిక, వైద్య పరీక్షలు, అంతరిక్షంలో ఉండడానికి అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు రష్యన్ కంపెనీ గ్లావ్‌కాస్మోస్‌తో ఇస్రో ఇటీవలే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గగన్‌యాన్ కోసం రూ.9,023 కోట్లను కేటాయించేందుకు కేంద్ర కేబినెట్ 2018లోనే ఆమోదం తెలిపింది.
ISRO Chief K Sivan: Chandrayaan-2 orbiter is doing very well. There are 8 instruments in the orbiter & each instrument is doing exactly what it meant to do.Regarding the lander, we have not been able to establish communication with it. Our next priority is Gaganyaan mission. pic.twitter.com/eHaWL6e5W1
— ANI (@ANI) September 21, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chandrayaan-2, ISRO, NASA