హోమ్ /వార్తలు /జాతీయం /

ఐసిస్ నెక్ట్స్ టార్గెట్ ఇండియా... బాంబు పేలుళ్లకు భారీ స్కెచ్...

ఐసిస్ నెక్ట్స్ టార్గెట్ ఇండియా... బాంబు పేలుళ్లకు భారీ స్కెచ్...

ఐసిస్ ఉగ్రవాదులు

ఐసిస్ ఉగ్రవాదులు

Sri Lanka Blast : భయం గుప్పిట్లో ఉన్న శ్రీలంకను టార్గెట్ చేసిన ఐసిస్ ఉగ్రవాదులు... భారత్‌లో అల్లకల్లోలం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. వాళ్ల ప్లానేంటి?

    న్యూజిలాండ్ ఉగ్ర దాడులకు ప్రతీకారంగానే శ్రీలంకలో పేలుళ్లకు పాల్పడ్డారన్నది ఉగ్రవాదుల వాదన. ఇది పైకి చెబుతున్నదే తప్ప... అసలు ప్లాన్ వేరే ఉందన్నది నిఘావర్గాల హెచ్చరిక. ఇన్నాళ్లూ గల్ఫ్ దేశాలకే పరిమితమైన ఐసిస్... అక్కడ అమెరికా గట్టిగా పోరాడుతుండటంతో... రూట్ మార్చిందనీ, ఇండియావైపు ఉగ్రవాదులు చూస్తున్నారనీ తెలిసింది. ఇండియాతోపాటూ... చుట్టూ ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, మాల్దీవులు, లక్ష దీవుల్లో తమ స్థావరాల్ని ఏర్పాటు చేసి... ప్రపంచ దేశాల్ని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఒకప్పుడు ఎల్టీటీఈ వల్ల తీవ్రంగా నష్టపోయిన శ్రీలంక... ఇప్పుడు ఉగ్రదాడులతో మళ్లీ భయం గుప్పిట్లోకి వెళ్లిపోయింది. మరిన్ని దాడులు జరగొచ్చన్న అమెరికా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు... ఆ దేశానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి.


    హోటళ్లు, చర్చిలు, సినిమా హాళ్లు, పార్కులు, రద్దీ ప్రదేశాలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు ఐసిస్ ఉగ్రవాదులు. ఉగ్రవాద దాడి జరిగిన హోటళ్ళలో ఒకటి భారత హై కమిషన్ కార్యాలయానికీ, శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే అధికార నివాసమైన టెంపుల్ ట్రీస్‌కి దాదాపు మధ్యలో ఉంది. ఇలాంటి చోట కూడా దాడి చేసేందుకు వెనకాడలేదంటే... ఉగ్రవాదులు ఎవర్నీ లెక్క చెయ్యట్లేదని అర్థమవుతూనే ఉంది. శ్రీలంకలో భద్రతను వాళ్లు ఎంత తక్కువగా అంచనా వేశారో ఊహించుకోవచ్చు. వాస్తవం కూడా అలాగే ఉంది. ఏకంగా 10 చోట్ల బాంబుల్ని పేల్చగలిగారంటే... శ్రీలంకలో భద్రత సరిగా లేనట్లే.


    దాడులకు పాల్పడింది శ్రీలంకలోని ఇస్లామిక్ తీవ్రవాద బృందం నేషనల్ తొవీత్ జమాత్ (ఎన్‌టిజె) అని అక్కడి ప్రభుత్వం చెబుతుంటే... కాదు తామే చేశామని ఐసిస్ ప్రకటించింది. శ్రీలంకలో ఎక్కువగా ఉండే బౌద్ధులను కాకుండా... క్రైస్తవులను టార్గెట్ చెయ్యడం ద్వారా... అమెరికా సహా పశ్చిమ దేశాలకు భయం కలిగించడమే ఉగ్రవాదుల లక్ష్యంగా కనిపిస్తోంది. సిరియాలో, ఇతర పశ్చిమాసియా దేశాల్లో ఐసిస్‌ను కట్టడి చేస్తుండటంతో అందుకు ప్రతీకారంగా శ్రీలంకలో దాడులకు పాల్పడి వుండొచ్చని భావిస్తున్నారు.


    శ్రీలంకలో పాతుకుపోయాక... అక్కడి నుంచీ ఇండియాలో దాడులు జరిపేందుకు ఐసిస్ కుట్రలు పన్నుతున్నట్లు తెలిసింది. ఇందుకోసం శ్రీలంకలో మరిన్ని దాడులు చేస్తారని సమాచారం. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న అనిశ్చిత పరిస్థితులు, పాలక సంకీర్ణంలో ఉన్న రాజకీయ గందరగోళం, దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే మధ్య ఉన్న తీవ్ర విభేదాలు... తమకు కలిసొస్తాయని ఉగ్రవాదులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇండియాలోని దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువగా ఐసిస్ ముప్పు కనిపిస్తోంది.


    ఇండియాలో ఐసిస్ దాడులకు దిగితే, వాటిని ఎదుర్కోవడం భారత్‌కు పెను సవాలే. అమెరికా లాంటి దేశాలే... సిరియా దాని చుట్టుపక్కల దేశాల నుంచీ ఐసిస్‌ను తరిమికొట్టలేకపోతున్నాయి. అలాంటిది మధ్య ఆదాయ దేశమైన ఇండియా ఎలా పోరాడగలదన్నది తేలాల్సిన అంశం. అసలు ఐసిస్ పుంజుకోకుండా చెయ్యడమే అసలైన పరిష్కారంగా భావిస్తున్న కేంద్రం... శ్రీలంకకు మరిన్ని విధాలుగా సాయం అందించాలనుకుంటోంది. శ్రీలంకలో ఉగ్రవాదాన్ని ఎంతలా తగ్గించగలిగితే, ఐసిస్ రాకను అంతలా అడ్డుకోవచ్చనే అంచనాల్లో ఉంది. దక్షిణాసియాలో ఉగ్రవాద కార్యకలాపాలను మరింత విస్తృతంగా, ప్రభావశీలంగా ఎదుర్కొనేందుకు భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్ అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.


     


    ఇవి కూడా చదవండి :


    బాబు జోక్ వేశాడు... 16 గంటలు ఆగిపోయిన విమానం... ఏమన్నాడంటే...


    ఏపీలో రాష్ట్రపతి పాలన రాబోతోందా... కేంద్రం నుంచీ సంకేతాలు...


    పైకి హ్యాపీ... లోపల టెన్షన్... చంద్రబాబు, జగన్ ఇద్దరూ అంతే... గెలుపుపై రకరకాల లెక్కలు...


    చంద్రబాబుకి సింగపూర్... జగన్‌కు స్విట్జర్లాండ్... వైసీపీ అధినేత ప్లాన్ అదిరిందిగా...

    First published:

    Tags: ISIS, Sri, Sri Lanka, Sri Lanka Blasts, Terror attack, Terrorism

    ఉత్తమ కథలు