హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Isha ambani : కవల పిల్లలతో ముంబైలోని తన ఇంటికి ఇషా అంబానీ

Isha ambani : కవల పిల్లలతో ముంబైలోని తన ఇంటికి ఇషా అంబానీ

కవల పిల్లలతో ముంబైలోని తన ఇంటికి చేరుకున్న ఇషా అంబానీ

కవల పిల్లలతో ముంబైలోని తన ఇంటికి చేరుకున్న ఇషా అంబానీ

Isha ambani arrives mumbai with twins : ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ(Isha ambani) నవంబర్ 19,2022న కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Isha ambani arrives mumbai with twins : ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ(Isha Ambani) నవంబర్ 19,2022న కవలలకు(Twins) జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆమెకు ఒక ఆడబిడ్డ,ఒక మగబిడ్డ పుట్టారు. ఇషా అంబానీ, భర్త ఆనంద్ పిరమల్ తమ కవలలను స్వాగతించారు. అప్పుడే పుట్టిన చిన్నారులకు ఆదియా, కృష్ణ అని పేర్లు పెట్టారు. అయితే అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లోని సిడార్స్ సినాయ్ మెడకిల్ సెంటర్ లో కవల పిల్లలకు జన్మనిచ్చిన ఇషా అంబానీ ఇవాళ తన భర్త ఆనంద్ పిరమల్, కవలలతో ఈరోజు ముంబై(Mumbai)లోని వర్లీ ఏరియాలోని తమ నివాసం కరుణ సింధు(Karuna Sindhu) దగ్గరకి చేరుకున్నారు. నవంబర్‌లో కవలలు పుట్టిన తర్వాత అంబానీ వారసుడు ఇంటికి రావడం ఇదే తొలిసారి.

అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ముంబైలోని కలీనా విమానాశ్రయంకి చేరుకున్న ఇషా, ఆనంద్‌ దంపతులకు వారి తల్లిదండ్రులు ఘన స్వాగతం పలికారు.  వర్లీలోని వారి ఇంటిని పువ్వులు, బొమ్మలతో అందంగా అలంకరించారు. వారి రాక తర్వాత, ఇషా తన కుటుంబ సభ్యులతో తిరిగి కలిసేటప్పుడు కవలలలో ఒకరిని చేతులతో పట్టుకుని కనిపించింది. తాతయ్యలు నీతా, ముఖేష్ అంబానీ చాలా సంతోషంగా కనిపించారు. కవలలో ఒకరిని నీతా అంబానీ ఎత్తుకుని ఆడిస్తున్నట్లు ఫొటోల్లో కినిపిస్తోంది.

Airlines: విమాన ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై అలా జరిగితే ఉచిత ప్రయాణం

నివేదికల ప్రకారం...ముంబై నుండి, ప్రసిద్ధ వైద్యుల బృందం లాస్ ఏంజిల్స్‌కు వెళ్లి ఇషా అంబానీ దంపతులను వారి కవలలతో కలిసి కలిసి ముంబైకి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. కవలల మొదటి విమానాన్ని సురక్షితంగా ఉండేలా చూసుకునేందుకు మెరికాలోని అత్యుత్తమ శిశువైద్యులలో ఒకరైన డాక్టర్ గిబ్సన్ కూడా వైద్యుల బృందంతో కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఎనిమిది మంది అమెరికన్ నానీలు, ప్రత్యేక నర్సులు కవలల సంరక్షణను తీసుకుంటారు. కాగా,రేపు డిసెంబర్ 25న ఇషా అంబానీ దంపతుల నివాసం కరుణ సింధులో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తిరుమల, శ్రీ ద్వారకాదీష్ దేవాలయం తదితర పూజారులు కోసం ప్రత్యేక పూజలు చేయనున్నట్లు సమాచారం.

First published:

Tags: Isha Ambani, Mukesh Ambani, Mumbai, Reliance

ఉత్తమ కథలు