హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Crime: వీడు అసలు కన్నకొడుకేనా..తండ్రిని నడిరోడ్డుపై చితకబాదుతూ..

Crime: వీడు అసలు కన్నకొడుకేనా..తండ్రిని నడిరోడ్డుపై చితకబాదుతూ..

crime(FILE)

crime(FILE)

దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే సొంతవారు అని చూడకుండా విచక్షణరహితంగా దాడులకు పాలపడుతున్నారు. క్షణికావేశంలో ప్రాణం తీయడానికి వెనకాడడం లేదు.

 • News18 Telugu
 • Last Updated :
 • Rajasthan, India

  దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే సొంతవారు అని చూడకుండా విచక్షణరహితంగా దాడులకు పాలపడుతున్నారు. క్షణికావేశంలో ప్రాణం తీయడానికి వెనకాడడం లేదు. నవమాసాలు మోసి కనీ పెంచిన అమ్మను, ఆపై కంటికి రెప్పలా కాపాడిన నాన్న అనే కనీస కనికరం లేకుండా దాడులకు పాల్పడుతున్నారు.

  వివరాల్లోకి వెళితే..రాజస్థాన్ జోధ్ పూర్ లోని రాతనడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. జోధ్ పూర్ లోని ఓ కుటుంబానికి చెందిన తండ్రి కొడుకు మధ్య వివాదం నెలకొంది. ఇది కాస్త ముదిరి కొడుకు కన్నతండ్రిపై చేయిచేసుకున్నాడు. ఈ ఘటనను గమనించిన కొందరు స్థానికులు హుటాహుటిగా పరిగెత్తుకొచ్చి ఆపాలని ప్రయత్నించినా పట్టించుకోకుండా వీదంతా తిప్పుతూ కర్రతో చితకబాదాడు. దీంతో అక్కడ ఉన్నస్థానికులు ఈ ఘటనకు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా..అది కాస్త వైరల్ గా మారింది.

  ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజెన్స్ నిందితుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక..నిందితుడిపై కఠిన చర్యలు తీసుకొని మరెవ్వరు ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చర్యలు చేపట్టారు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం..నిందితుడు తండ్రిపై దాడి చేయడం ఇదే మొదటిసారి కాదని పలుమార్లు ఇలాగే తండ్రిని హింసిస్తూ ఉంటాడని తెలియజేసారు. అంతేకాకుండా ఈ ఘటన జరిగిన ముందు రోజు కూడా కొడుకు అనుచితంగా మాట్లాడని తెలియజేసారు.

  దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని 151 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. దేశంలో ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని నెటిజన్స్ మండిపడుతున్నారు. ప్రస్తుతం బాధితుడిని ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

  Published by:Rajasekhar Konda
  First published:

  Tags: Father

  ఉత్తమ కథలు