ఢిల్లీలో ISIS ఉగ్రవాదులు అరెస్ట్.. రిపబ్లిక్ డేనే టార్గెట్

ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యాయి. వజీరాబాద్ ప్రాంతంలోని ఇళ్లను తనిఖీలు చేయడంతో పాటు పలు ప్రాంతాల్లో భద్రతా దళాలను మోహరించారు

news18-telugu
Updated: January 9, 2020, 5:08 PM IST
ఢిల్లీలో ISIS ఉగ్రవాదులు అరెస్ట్.. రిపబ్లిక్ డేనే టార్గెట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. ముగ్గురు ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాదులను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. గురువారం ఉదయం ఢిల్లీలో వజీరాబాద్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ ఘటన తర్వాత కాసేపటికే ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ రాజధాని ప్రాంతంలో భారీ ఉగ్రకుట్రకు వీళ్లు కుట్ర చేసినట్లు సమాచారం. జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఉగ్రదాడులకు వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. ఐసిస్ ఉగ్రవాదులకు విదేశాల్లో ఉన్న కొన్ని శక్తులు మార్గనిర్దేశం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో మరిన్ని కీలక వివరాలు బయటకొచ్చే అవకాశముంది. ఈ ఘటనతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యాయి. వజీరాబాద్ ప్రాంతంలోని ఇళ్లను తనిఖీలు చేయడంతో పాటు పలు ప్రాంతాల్లో భద్రతా దళాలను మోహరించారు.

First published: January 9, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు