ఎన్నికల ఫలితాలపై... టీడీపీ వ్యూహం ఏంటి... వైసీపీ ఏం చేయబోతోంది...

AP Assembly Elections : ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికలపై టీడీపీ ఏమాత్రం సంతృప్తిగా లేదని తెలుస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: April 15, 2019, 12:23 PM IST
ఎన్నికల ఫలితాలపై... టీడీపీ వ్యూహం ఏంటి... వైసీపీ ఏం చేయబోతోంది...
చంద్రబాబు, జగన్ (File)
  • Share this:
తెలుగు రాష్ట్రాలతో మొదలైన తొలి దశ ఎన్నికలు జరిగిన తీరుపై ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ టీడీపీ తీవ్ర అసంతృప్తితో ఉంది. అసలే ఈవీఎంలపై అనుమానాలు పెంచుకున్న ఆ పార్టీ... ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించడం, దాదాపు 20 చోట్ల చిన్నా, పెద్దా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటం, అర్థరాత్రంతా పోలింగ్ జరగడం ఇవన్నీ చూసి... తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓవైపు ఎన్నికల్లో గెలిచేది తామేననీ, ప్రజలంతా తమకే ఓట్లు వేశారనీ, ముఖ్యంగా మహిళలూ, ముసలివాళ్లు తమతోనే ఉన్నారని చెబుతున్న సైకిల్ పెద్దలు... లోలోపల మాత్రం ఎన్నికలు జరిగిన తీరును జీర్ణించుకోలేకపోతున్నారని తెలిసింది. ప్రధానంగా ప్రతిపక్ష వైసీపీ ఎన్నికల ఫలితాలపై పూర్తి సంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తుండటంతో... కచ్చితంగా ఏదో కిరికిరి జరిగే ఉంటుందని టీడీపీ నేతలు ఆఫ్ ద రికార్డులో మాట్లాడుకుంటున్నట్లు తెలిసింది.

ఢిల్లీ స్థాయిలో బీజేపీ అగ్రనేతల అండదండలతో జగన్ ముందుకు సాగుతున్నారని భావిస్తున్న టీడీపీ వర్గాలు... కచ్చితంగా జగన్‌ను గెలిపించేందుకు బీజేపీ నేతలు ఎన్ని ఎత్తుగడలైనా వేసి ఉంటారనీ, అందువల్ల ప్రజలు తమకే అనుకూలంగా ఓటు వేసినా... ఫలితం మాత్రం వైసీపీకి అనుకూలంగా వచ్చే ప్రమాదం ఉందని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో మే 23న ఫలితాలు వచ్చాక... నిజంగా గెలవాల్సిన తాము... అవకతవకల కారణంగా ఓడిపోతామేమోనని అంచనాలకు వస్తున్న టీడీపీ వర్గాలు... అవసరమైతే... మళ్లీ ఎన్నికలు జరిపించే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. బ్యాలెట్ విధానంలో అయితేనే, ఎవ్వరూ ఎలాంటి అక్రమాలకూ పాల్పడకుండా ఉంటారనీ... ఫలితాలు పూర్తి వాస్తవాలతో ఉంటాయని టీడీపీ అధిష్టానం వంద శాతం నమ్ముతుండటమే ఇందుకు ప్రధాన కారణం.


రెండు ఆప్షన్లు : ప్రస్తుతం టీడీపీ రెండు ఆప్షన్లు వెతుక్కుంటోంది. మొదటిది... ఈవీఎంలలోని వీవీప్యాట్లలో 50 శాతం స్లిప్పులను కౌంట్ చెయ్యాలి. ఈవీఎంలో ఏ పార్టీ సింబల్ బటన్ నొక్కితే, వీవీప్యాట్‌లో అదే గుర్తుకు ఓటరు స్లిప్ వచ్చిందో, లేదో తేల్చాలని కోరుకుంటోంది. టీడీపీ ఆరోపిస్తున్నట్లు ఒకవేళ వీవీప్యాట్ స్లిప్పులలో ఏ చిన్న తేడా వచ్చినా... మొత్తం ఎన్నికల ప్రక్రియనే రద్దు చెయ్యించాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది.

రెండో ఆప్షన్ ఎన్నికలు... ఆల్రెడీ చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించిన కారణంగా... కచ్చితంగా వీవీప్యాట్ స్లిప్పులలో తేడాలు ఉంటాయనీ, మళ్లీ ఎన్నికలకు రెడీ అవ్వడమే మంచిదన్న ఉద్దేశంలో టీడీపీ అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఇప్పటి నుంచీ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకునే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం.

తిప్పికొట్టే పనిలో వైసీపీ : ఏం జరిగినా సరే... ఇప్పుడున్న ఈవీఎంలలో ప్రజలు ఇచ్చిన తీర్పునే ఫైనల్ తీర్పుగా లెక్కలోకి తీసుకోవాలనీ, దాని ప్రకారమే మే 23 తర్వాత వచ్చే ప్రభుత్వం ఏర్పడాలని వైసీపీ బలంగా కోరుతోంది. వీవీప్యాట్లు లెక్కించినా, ఏం చేసినా సరే... ఈవీఎంలలో ఇచ్చిన తీర్పును అందరూ ఒప్పుకోవాల్సిందేనని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తమ వాదనను ఢిల్లీ స్థాయిలో వినిపించే క్రమంలో... కేంద్ర ఎన్నికల సంఘం ముందు విజ్ఞాపనలు చేస్తున్నారు. మళ్లీ ఎన్నికలు జరిపించాలని భావిస్తున్న టీడీపీ వ్యూహాల్ని తిప్పికొట్టేందుకు గట్టిగా ప్రయత్నించాలని పార్టీ నేతలకు హైకమాండ్ నుంచీ ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.


మళ్లీ ఎన్నికలు జరిగితే : ఒకవేళ టీడీపీ భావిస్తున్నట్లు మళ్లీ ఎన్నికలు జరిపితే మాత్రం... అవి బ్యాలెట్ విధానంలోనే జరిపే అవకాశాలుంటాయి. అసలు మళ్లీ ఎన్నికలనేవి జరగాలంటే ముందు... ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని నిరూపించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎంతలా టీడీపీ సక్సెస్ అయితే, అంతలా ఆ పార్టీ మళ్లీ ఎన్నికలు జరిపించేందుకు అవకాశాలు మెరుగవుతాయి. ఈ విషయంలో వైసీపీ ఎంతలా టీడీపీని కట్టడి చెయ్యగలిగితే, అంతలా ఆ పార్టీకి ప్రస్తుత ప్రజల తీర్పునే ఫైనల్ తీర్పుగా పరిగణించే అవకాశాలు మెరుగవుతాయని తెలుస్తోంది.ఇవి కూడా చదవండి :కిస్ ఇస్తే కొంపముంచాడు... ఆ యువతికి ఏం జరిగిందంటే...

మహిళలు వైసీపీకి ఓటు వేశారా... పోలింగ్ డే నాడు చంద్రబాబు వ్యూహం ఫెయిలైందా...

30 కోట్ల మంది కస్టమర్లు... దూసుకెళ్తున్న రిలయన్స్ జియో...

నేడు ప్రపంచ కప్ భారత జట్టు ప్రకటన... ఛాన్స్ కొట్టేసేదెవరు...
Published by: Krishna Kumar N
First published: April 15, 2019, 12:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading