నేడు ప్రధాని మోదీ బెంగళూరు వస్తారా? దక్షిణ బెంగళూరుకు నామినేషన్ వేస్తారా?

Lok Sabha Elections 2019 : దక్షిణాదిన బీజేపీకి కంచుకోటైన దక్షిణ బెంగళూరు నుంచీ ప్రధాని మోదీ పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది.

Krishna Kumar N | news18-telugu
Updated: March 29, 2019, 6:38 PM IST
నేడు ప్రధాని మోదీ బెంగళూరు వస్తారా? దక్షిణ బెంగళూరుకు నామినేషన్ వేస్తారా?
నరేంద్ర మోదీ (File)
  • Share this:
ఈసారి లోక్ సభ ఎన్నికలు ఉత్తరాదిన కంటే దక్షిణాదిన దుమ్ము రేపుతున్నాయి. కారణం అగ్రనేతలు సౌత్ నుంచి కూడా పోటీ చేస్తారనే ఊహాగానాలే. వారణాసి నుంచీ మరోసారి బరిలో దిగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ... దక్షిణ బెంగళూరు నుంచి కూడా పోటీ చేస్తారనీ... అందుకు ఇవాళ నామినేషన్ వేసేందుకు వస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన రాకపోయినా... ఇప్పటికే బెంగళూరు పూర్తిగా హై సెక్యూరిటీలోకి వెళ్లిపోయింది. ఎవరో వీవీఐపీ బెంగళూరు వస్తారని చెబుతున్నారే తప్ప... అది ప్రధాని మోదీ అని మాత్రం చెప్పట్లేదు. ఐతే... కర్ణాటకలో కాంగ్రెస్ ప్రకటించిన లోక్ సభ అభ్యర్థుల జాబితాలో... దక్షిణ బెంగళూరుకు అభ్యర్థి లేరు. అక్కడ మొత్తం 20 లోక్‌ సభ స్థానాల్లో 18 సీట్లకు అభ్యర్థుల జాబితాను శనివారం అర్థరాత్రి కాంగ్రెస్ ప్రకటించింది. మిగతా 8 లోక్ సభ స్థానాల్లో మిత్రపక్షం జేడీఎస్ పోటీ చెయ్యబోతోంది. దక్షిణ బెంగళూరు, ధార్వాడ్ నియోజకవర్గాలకు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు. ధార్వాడ్ ఎన్నికలు ఏప్రిల్ 23న మూడో దశలో జరగనున్నాయి. అందువల్ల అక్కడ అభ్యర్థిని ప్రకటించేందుకు చాలా టైమ్ ఉంది. కానీ, దక్షిణ బెంగళూరుకు రెండో దశలో ఏప్రిల్ 18న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ వేసేందుకు చివరి తేదీ మార్చి 26. అందుకే ఇవాళ మోదీ వస్తారని చెప్పుకుంటున్నారంతా.

1991 నుంచీ దక్షిణ బెంగళూరు స్థానంలో ప్రతిసారీ బీజేపీయే గెలుస్తూ వస్తోంది. అందువల్ల కాంగ్రెస్ ఆ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేసేముందు వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకరకంగా దక్షిణ బెంగళూరు... కాంగ్రెస్‌కి కలిసిరాని స్థానమనే చెప్పాలి. 1977 నుంచీ అక్కడ కాంగ్రెసేతర అభ్యర్థే గెలుస్తున్నారు. ఒక్క 1989లో మాత్రమే కాంగ్రెస్ ఆ స్థానాన్ని దక్కించుకోగలిగింది. ఆ తర్వాత రెండేళ్లకే దాన్ని బీజేపీకి సమర్పించుకుంది. 1991లో తొలిసారిగా బీజేపీ బోణీ కొట్టింది. ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్.కె.వెంకటగిరి గౌడ... బీజేపీ తరపున అక్కడ అకౌంట్ తెరిచారు.


1996 నుంచీ గత నవంబర్ వరకూ... ఆరుసార్లు ఇక్కడ కేంద్ర మంత్రి అనంతకుమార్ ఎంపీగా గెలుస్తూ వచ్చారు. ఆయన చనిపోయేవరకూ ఈ స్థానం బీజేపీతోనే ఉంది. ఆయన భార్య తేజశ్విని ప్రస్తుతం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ టికెట్ కోసం ఆశలు పెట్టుకున్నారామె. మరి అక్కడి నంచీ మోదీ పోటీ చేస్తారా లేదా అన్నదానిపై కర్ణాటక బీజేపీ నేతలు తమకు ఎలాంటి సమాచారమూ లేదంటున్నారు.

సిటీ పోలీసులు మాత్రం... సోమవారం సెక్యూరిటీని పెంచాల్సిందిగా తమకు ఆదేశాలొచ్చాయనీ, అందుకే సెక్యూరిటీ పెంచామనీ చెబుతున్నారు. మోదీ గనక దక్షిణ బెంగళూరు నుంచీ పోటీ చేస్తే, తాము బలమైన అభ్యర్థిని బరిలో దింపుతామని ప్రకటించింది. మోదీ గనక సౌత్ నుంచీ పోటీ చేస్తే... దక్షిణాన బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం రావడం గ్యారెంటీ. 

ఇవి కూడా చదవండి :

వర్చువల్ సిమ్ అంటే ఏంటి... పుల్వామా ఉగ్ర దాడిలో ఎలా వాడారు?స్మృతి ఇరానీ అంటే రాహుల్ భయపడుతున్నారా... ఆమెకు అంత సీన్ ఉందా?

29న ఏపీకి ప్రధాని మోదీ... ఏం చెప్తారు... ప్రత్యేక హోదాపై మాట్లాడతారా?

నామినేషన్లకు నేడే ఆఖరి రోజు... ఇప్పటివరకూ ఎన్ని వేశారు... ప్రత్యేకతలేంటి?
First published: March 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు