Home /News /national /

IS NIA INVOLVING TO ELIMATE MAOIST VS KMM

chattisgarh: తీవ్రవాదులుతోపాటు మావోయిస్టులు కూడ దేశద్రోహులేనా...మావోయిస్టుల ఏరివేతకు ఎన్‌ఐఏ రంగంలోకి దిగిందా..?

maoist attacks

maoist attacks

chattisgarh: బీజాపూర్ దాడుల వెనక ఎన్ఐఏ అస్త్ర్రం ఉందా..మావోయిస్టుల ఏరివేతలో ఎన్ఐఏ పాత్ర ఎంత ? బీజాపూర్ దాడుల్లో ఎన్ఐఏ పాత్ర ఉందన్న మావోయిస్టుల ప్రకటన వెనక నిజం ఎంత...తీవ్రవాదులు, ఉగ్రవాదుల సరసన మావోయిస్టులను చేర్చారా..?

నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ.. ఎన్‌ఐఏగా పిలుచుకునే ఈ ఏజెన్సీ మావోయిస్టులపై దృష్టి సారించిందా..? ఇప్పటిదాకా కేవలం టెర్రరిస్ట్‌ అటాక్‌ల విచారణ, దర్యాప్తు.. కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విధులకు మాత్రమే పరిమితమైన ఎన్‌ఐఏ.. ఇక నుంచి దేశ అంతర్గత తీవ్రవాదం పైనా దృష్టి సారించిందా అనే సందేహాలు కల్గుతున్నాయి. తాజాగా ఈనెల 19న డ్రోన్ల ద్వారా ఆకాశమార్గంలో బాంబు దాడులు చేశారని ఆరోపిస్తున్న మావోయిస్టులు మరికాస్త ముందడుగు వేసి ఎన్‌ఐఏ పర్యవేక్షణలోనే ఇది జరిగిందని చెబుతున్నారు. దీంతో టెర్రరిస్టుల ఏరివేతలో సక్సెస్ సాధిస్తున్న ఎన్ఐఏ నక్సల్స్ ఏరివేతలో కూడ కీలకం కానున్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎన్‌ఐఏ పాత్ర ఉందా..

అసలు ఎన్‌ఐఏ ఉద్దేశం ఏంటి..? అది నిత్యం చేసే పని ఏంటి..? ఇలా అంతర్గత తీవ్రవాదంపైనా గతంలో ఎప్పుడైనా దృష్టి పెట్టిందా.. అన్నది చెప్పలేని విషయం. నిజానికి ఇప్పటిదాకా కేవలం ఉగ్రవాద నిరోధక ఆపరేషన్స్‌, విచారణ, దర్యాప్తు, టెర్రర్‌ గ్రూపుల కదలికలు, వాటిపై కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌కు మాత్రమే పరిమితమైన ఎన్‌ఐఏ ఇక నుంచి వామపక్ష తీవ్రవాదంపైనా పోరాటం చేయనుందా..? అంటే ప్రాక్టికల్‌గా కష్టమనే చెప్పవచ్చు.

డ్రోన్‌ల ద్వార దాడులు


స్వంత క్యాడర్ లేని ఏన్‌ఐఏ

ఎన్‌ఐఏకు ఎలాంటి సొంత క్యాడర్‌ లేదు. ఇప్పటికీ ఎన్‌ఐఏ విభాగంలోకి డిప్యుటేషన్ల మీద వివిధ స్థాయుల్లోని అధికారులు, సిబ్బందిని నియోగిస్తున్నారు. అయితే వ్యూహ రచన, ఆపరేషన్స్‌ పర్యవేక్షణలో నైపుణ్యం, అనుభవం ఉన్న ఎన్‌ఐఏ సేవలను వామపక్ష తీవ్రవాదం నిరోధానికి ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందా అన్న సందేహాలు మావోయిస్టుల చేసిన ప్రకటనతో కలుగుతున్నాయి.

గత కొన్నేళ్లుగా అర్బన్‌ నక్సలిజం పేరిట మావోయిస్టు సానుభూతి పరులను గుర్తించడం.. వారి సంభాషణలు.. ఉత్తర ప్రత్యుత్తరాలను బేస్‌ చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటిదాకా ఇలాంటి వాటికే పరిమితం అయిన ఎన్‌ఐఏ.. ఇక నుంచి క్షేత్ర స్థాయి దాడులకు కూడా వ్యూహరచన చేయనుందా..? వాటిని క్లోజ్‌గా మోనటరింగ్‌ చేయనుందా.. అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

nia raida in virasam in ap telangana
ప్రతీకాత్మక చిత్రం


బీజాపూర్ దాడుల వెనుక ఎన్‌ఐఏ ..?

ఇప్పటిదాకా వివిధ రాష్ట్రాల్లో గ్రేహౌండ్స్‌.. కోబ్రా, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, స్పెషల్‌ పోలీస్‌లతో పాటుగా స్థానిక పోలీసులు నక్సల్స్‌పై పోరాటం చేస్తున్నారు. అయితే వీటిలో ఏ ఒక్క విభాగానికి కూడా టెక్నాలజీ సాయంతో దాడులకు దిగే స్థాయి లేదన్న వాదన వినిపిస్తోంది. దీంతోనే బీజపూర్‌ జిల్లాలో జరిగిన ఈ డ్రోన్ దాడుల వెనుక ‌ఎన్‌ఐఏ పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మావోయిస్టులకు గడ్డుకాలమేనన్న వాదన కూడ వినిపిస్తోంది..కాగా ఎన్ఐఏ ప్రోద్బలంతోనే బీజాపూర్‌లో దాడులు చేశారన్న ఆరోపణలను పోలీసులు మాత్రం ఎక్కడ ఖండించలేదు.

పాత గెరిల్లాదాడులతో మావోయిస్టులు

అయితే భద్రతా దళాలు మావోయిస్టుల అంతానికి కొంత టెక్నాలజిని వాడుతుంటే... మావోయిస్టులు మాత్రం తమ పాత విధానాలను తెరపైకి తెస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా మహారాష్ట్రలని గడ్చిరోలి జిల్లా ఎటవల్లి తాలూకలోని గట్టా పోలీసుస్టేషన్‌పైన నక్సల్స్‌ రాకెట్‌ లాంఛర్‌తో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఎవరికీ ప్రాణనష్టం జరక్కపోయినా పోలీస్‌స్టేషన్‌ సెంట్రీ రూంకు పెద్ద రంధ్రం పడింది. ఇది హ్యాండ్‌మేడ్‌ రాకెట్‌ లాంఛర్‌గా భావిస్తున్నారు. అయితే గతంలోనూ పీఎల్‌జీఏ (మావోయిస్టు పార్టీ ఆపరేషన్స్‌ విభాగం) డైరెక్షనల్‌ మైన్స్‌, క్లెమోర్‌మైన్స్‌ లాంటి వాటిని ఉపయోగించి పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడిన విషయం తెలిసిందే.

పోలీస్ స్టేషన్ పై మావోయిస్టుల దాడి
Published by:yveerash yveerash
First published:

Tags: Chatisghad, Khammam, Maoists

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు