హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Hydearabad Floods: వరదలతో వాహనాలు దెబ్బతిన్నాయా?.. ఈ ఇన్సూరెన్స్ ఉంటే మొత్తం కవరేజీ

Hydearabad Floods: వరదలతో వాహనాలు దెబ్బతిన్నాయా?.. ఈ ఇన్సూరెన్స్ ఉంటే మొత్తం కవరేజీ

హైదరాబాద్ లో వరదలకు దెబ్బతిన్న వాహనాలు

హైదరాబాద్ లో వరదలకు దెబ్బతిన్న వాహనాలు

Hydearabad Floods: వాహన ఇన్సూరెన్స్ కు సంబంధించిన నియమ, నిబంధనలు అన్ని కంపెనీలకు ఒకేలా ఉండవు. వీటిపై కస్టమర్లు అవగాహన పెంచుకోవాలి.

  మారిన వాతావరణ పరిస్థితులతో వర్షపాతం సాధారణం కంటే ఎన్నో రెట్లు అధికంగా నమోదవుతోంది. దీంతో దేశంలోని చాలా నగరాలను వరదలు ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్‌ మహానగరానికి కనీవినీ ఎరగని రీతిలో వరదలు ప్రాణ, ఆస్తి నష్టాలను మిగిల్చాయి. ఎంతో మంది కార్లు, బైక్‌లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. ఇలా వరద నీటిలో చిక్కుకున్న వాహనాల ఇంజిన్‌తో పాటు విద్యుత్ వ్యవస్థలు పని చేసే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను భర్తీ చేయడానికి కార్లకు ఇన్సూరెన్స్ చేయించాలి. వాహన ఇన్సూరెన్స్ కు సంబంధించిన నియమ, నిబంధనలు అన్ని కంపెనీలకు ఒకేలా ఉండవు. వీటిపై కస్టమర్లు అవగాహన పెంచుకోవాలి. వరదల వల్ల కార్లకు ఇంజిన్, కారు యాక్సెసరీలు డ్యామేజ్ కావడం వంటి  రెండు రకాల నష్టాలు వాటిల్లుతాయి. సాధారణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ రెండింటినీ కవర్ చేస్తాయని పాలసీ బజార్ నివేదిక చెబుతోంది. కానీ ఇంజిన్‌లోకి నీరు చేరడం, ఆయిల్ లీకేజీ వల్ల ఇంజిన్, ఇతర భాగాలకు నష్టం వాటిల్లితే... వీటికి పాలసీ వర్తించదు. ఇంజిన్ డ్యామేజ్ అనేది ఎలక్ట్రికల్, మెకానికల్ బ్రేక్‌డౌన్ కిందకు రావడమే ఇందుకు కారణం.

  సాధారణ ఇన్సూరెన్స్ సరిపోదు..

  కార్లు కొన్నవారు తప్పనిసరిగా ఇంజిన్ ప్రొటెక్టర్ యాడ్ ఆన్ కవర్ ను తీసుకోవాలని పాలసీబజార్ మోటార్ ఇన్సూరెన్స్ హెడ్ సజ్జా ప్రవీణ్ చౌదరి సూచిస్తున్నారు. దీనికి రూ.1,000 నుంచి రూ.10,000 వరకు ఖర్చవుతుందని ఆయన తెలిపారు. ఇది ఉంటేనే వరదల వల్ల కలిగే ఇంజిన్ డ్యామేజ్‌కు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని చెప్పారు. ఇంజిన్‌లోకి నీరు వెళ్లడం, చమురు లీకేజీ వల్ల ఇంజిన్ భాగాలు, డిఫరెన్షియల్ పార్ట్స్‌, గేర్‌బాక్స్‌లు దెబ్బతింటాయి. ఇంజిన్ ప్రొటెక్టర్ యాడ్ ఆన్ కవర్ ప్యాకేజీ ద్వారా వీటన్నింటికీ ఇన్సూరెన్స్ వర్తిస్తుందని ప్రోబస్ ఇన్సూరెన్స్ సంస్థ డైరెక్టర్ రాకేశ్ గోయల్ వివరించారు. ఇలాంటి యాడ్ ఆన్ ఇన్సూరెన్స్ కవర్ ప్యాకేజీలు సహజ విపత్తుల సమయంలో కారుకు అదనపు రక్షణ, ఇన్సూరెన్స్ కవరేజీని అందిస్తాయని గోయల్ చెబుతున్నారు.

  యాడ్ ఆన్ కవరేజ్ తప్పనిసరి

  కస్టమర్లు ఇన్వాయిస్ ప్రొటెక్షన్ కవర్ ను కూడా తీసుకోవాలి. ఇది ఇన్సూర్డ్‌ డిక్లేర్డ్‌ వ్యాల్యూ, కారు ఇన్వాయిస్ వ్యాల్యూ మధ్య అంతరాన్ని కవర్ చేస్తుందని చౌదరి తెలిపారు. కార్లకు సంబంధించిన నట్లు, బోల్ట్లు, స్క్రూ, వాషర్, గ్రీజు, లూబ్రికెంట్, క్లిప్‌లు, ఏసీ గ్యాస్, బేరింగ్లు, డిస్టిల్డ్ వాటర్, ఇంజిన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్, ఫ్యూయల్ ఫిల్టర్, బ్రేక్ ఆయిల్ వంటి ఇతర భాగాలకు ఇన్సూరెన్స్ వర్తించదు. కస్టమర్లు వీటన్నింటికీ కలిపి అదనంగా యాడ్ ఆన్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, వీటి వల్ల కలిగే నష్టాన్ని ఆయా సంస్థలు చెల్లిస్తాయి. వీటిని ఎప్పటికప్పుడూ సరిచూసుకుని మార్చుకోవాలి.

  ఇవి సరిచూసుకోవాలి

  కంప్లీట్ ప్రొటెక్షన్ కవరేజీతో పాటు వరదల వల్ల కార్లకు జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు ఫోన్‌పే వైస్‌ ప్రెసిడెంట్ అండ్ ఇన్సూరెన్స్ హెడ్ గుంజన్‌ ఘాయ్. అవేంటంటే...


  1. వరదలో మునిగిపోయిన కారును శుభ్రపరిచిన తరువాత దాన్ని స్టార్ట్ చేయకూడదు. జంప్‌ స్టార్టింగ్ ద్వారా కారును స్టార్ట్ చేసే ప్రయత్నాలు చేయకూడదు.

  2. ముందు కారు బ్యాటరీని డిస్‌కనెక్ట్ చేయాలి. దాన్ని నెట్టుకుంటూ సమీపంలోని గ్యారేజీకి తీసుకెళ్లాలి.

  3. కారు బ్రేక్‌లను తనిఖీ చేయమని మెకానిక్‌కు చెప్పాలి. వరదల వల్ల ఇవి కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది.


  ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?

  వరదల సమయంలో కారు ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసుకోవడానికి వినియోగదారులు ఇన్సూరెన్స్ కంపెనీ కాల్ సెంటర్ కు కాల్ చేసి క్లెయిమ్ గురించి అడగాలి. సంబంధిత సంస్థ వెబ్‌సైట్, యాప్‌లలో ఈ కాల్ సెంటర్ నంబర్లు ఉంటాయి. ఇన్సూరెన్స్  చేయించిన తరువాత కస్టమర్ల ఈ మెయిల్ కు వచ్చే పీడీఎఫ్‌ డాక్యుమెంట్లలో కూడా క్లెయిమ్‌కు సంబంధించిన ఫోన్‌ నంబర్ల వివరాలు ఉంటాయి. దీని గురించి ఇన్సూరెన్స్ పార్ట్నర్‌కు ఈమెయిల్ చేయవచ్చు.

  ఇన్సూరెన్స్ కంపెనీలను సంప్రదించిన తరువాత కస్టమర్లు తమ కార్లను గ్యారేజీకి తీసుకెళ్లవచ్చు. లేదంటే ఇన్సూరెన్స్ పార్ట్‌నర్ల నెట్‌వర్క్‌ గ్యారేజీలకు తీసుకెళ్లవచ్చు. రిపేర్లు పూర్తయిన తర్వాత పేమెంట్‌ను సెటిల్ చేస్తారు. నియమ నిబంధనలకు బట్టి ఇన్సూరెన్స్ కంపెనీ నేరుగా గ్యారేజీ నెట్‌వర్క్‌ పార్ట్నర్‌కు కూడా రిపేర్‌ ఖర్చులు చెల్లించవచ్చని ఘాయ్ వివరించారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Hyderabad Floods, Hyderabad Heavy Rains, Insurance

  ఉత్తమ కథలు