DA: జులై 1 నుంచి కేంద్ర ఉద్యోగులకు కరవు బత్యం పెంపు? ఆర్థిక శాఖ ఏం చెప్పిందంటే...

జులై 1 నుంచి కేంద్ర ఉద్యోగులకు కరవు బత్యం పెంపు? (image credit - twitter)

Dearness allowance: దేశంలో వస్తువుల ధరలు బాగా పెరిగాయి కాబట్టి... కరవుబత్యం (DA) పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కోరారు. దీనిపై చర్చ జరిగింది. చివరకు ఆర్థిక శాఖ దీనిపై స్పందించింది.

  • Share this:
    Dearness allowance: జులై 1 నుంచి కరవు బత్యం పెరుగుతుంది అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే... గతేడాది ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం DA పెంపు అంశాన్ని పక్కన పెట్టింది. దీనిపై ఈ ఏడాది జూన్ 30 నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అందువల్ల జులై 1 నుంచి డీఏ పెంపు ఉంటుందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. జులై 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డీఏకి సంబంధించి పూర్తి ప్రయోజనాలు పొందుతారు అనే వార్తలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇది గమనించిన కేంద్ర ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇచ్చింది.

    కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ... డీఏ పెంపుకి సంబంధించి ఎలాంటి నోటీసులు, ఆర్డర్లూ జారీ చెయ్యలేదు అని తెలుపుతూ... ఓ ట్వీట్ చేసింది. ఇందుకు సంబంధించి... కేంద్ర ప్రభుత్వం జారీ చేసినట్లుగా నెట్‌లో సర్క్యులేట్ అవుతున్న డాక్యుమెంట్ నిజమైనది కాదు అని, ఫేక్ అని తేల్చింది. ఇలాంటిది ఏదీ తాము జారీ చెయ్యలేదు అని శనివారం ట్వీట్ చేసింది.



    జూన్ 26న కేంద్రం ఈ డాక్యుమెంట్ జారీ చేసినట్లుగా ఫేక్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అసలు పనిగట్టుకొని ఇలాంటి వార్తలు ఎవరు సృష్టిస్తున్నారు, ఎందుకు అనే అంశాన్ని కేంద్ర వర్గాలు పరిశీలిస్తున్నాయి.

    డాక్యుమెంట్ సంగతి అలా ఉంచితే... ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంపు లేనట్లే అని అర్థమైపోతోంది. మరి ఇక ఈ పెంపు ఎప్పుడు ఉంటుందో ఏమో కూడా స్పష్టత లేదు. పెంపు ఉంటుందని ఆశలు పెట్టుకున్న ఉద్యోగులకు ఇది చేదు వార్తే.

    దేశంలో కరోనా వచ్చాక ధరలు బాగా పెరిగాయి. ముఖ్యంగా నూనెల ధరలు దాదాపు డబుల్ అయ్యాయి. పెట్రోల్ ధరలు ఆకాశంలో ఉన్నాయి. ఏ విధంగా చూసినా... చేతిలో డబ్బుకి విలువ తగ్గిపోయిందన్నది నిజం. ఇదివరకు రూ.100కి వచ్చే వస్తువులకు ఇప్పుడు రూ.150 దాకా ఖర్చవుతోంది. అందువల్ల డీఏ పెంచాలని ఉద్యోగులు, పెన్షనర్లూ కోరుతున్నారు. కానీ కేంద్రం మాత్రం కరోనా సమస్యలు ఉన్నాయంటూ... వాయిదా వేస్తోంది.

    డీఏ సమస్యపై శనివారం కాంగ్రెస్ ఫైర్ అయ్యింది. వెంటనే డీఏ పెంచాలని డిమాండ్ చేసింది. 113 లక్షల మంది ఉద్యోగుల్ని కరోనా సేవల్లో పాల్గొనమని కేంద్రం ఎంకరేజ్ చేస్తోంది. కానీ... సైనికులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కేంద్రం రూ.37,500 కోట్లు దోచేసింది అని కాంగ్రెస్ నేత రాహుల్ ట్వీట్ చేశారు.

    ఇది కూడా చదవండి: జార్ఖండ్ అమ్మాయి.. డజన్ మామిడిపండ్లు రూ.1.2 లక్షలకు అమ్మింది... ఎందుకో తెలుసా?

    దీనిపై భారతీయ జనతా పార్టీ (BJP) స్పందించింది. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అని తెలిపింది. అన్ని అంశాల్నీ లెక్కలోకి తీసుకొని... కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుంది అని ఆ పార్టీ నేత గోపాల్ అగర్వాల్ తెలిపారు.
    Published by:Krishna Kumar N
    First published: