హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (Himachal Pradesh Assembly Elections)- 2022 వేళ కాంగ్రెస్ (Congress) కు భారీ షాక్ తగిలింది. మరో 4 రోజుల్లో పోలింగ్ జరుగుతుంది అనగా..సొంత పార్టీ నాయకులే హస్తం పార్టీకి ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ (Congress) రాష్ట్ర కార్యవర్గానికి చెందిన 26 మంది కీలక నేతలు కాంగ్రెస్ (Congress) ను వీడి కాషాయ కండువా కప్పుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి ధరంపాల్ ఠాకూర్ ఖండ్ తో పాటు పలువురు నాయకులు సోమవారం బీజేపీ (Bjp)లో చేరారు. వీరందరికి సీఎం జైరాం ఠాకూర్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి సుధాన్ సింగ్ లు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సిమ్లా బీజేపీ అభ్యర్థి సంజయ్ సూద్ తో పాటు మరికొంతమంది నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జైరాం ఠాకూర్ మాట్లాడుతూ..హిమాచల్ (Himachal Pradesh) లో బీజేపీ (Bjp) చారిత్రక విజయానికి అందరం కలిసి కట్టుగా పని చేయాలన్నారు. 26 మంది నాయకులు కాంగ్రెస్ కు కోలుకోలేని షాకివ్వగా వారి చేరికతో బీజేపీ బలపడింది. వారి సాయంతో హిమాచల్ (Himachal Pradesh) లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతుంది. మరి కాంగ్రెస్ నాయకుల చేరికతో హిమాచల్ లో కాషాయ కండువా ఎగరేస్తారా లేదా అనేది చూడాలి.
హిమాచల్ ప్రదేశ్‌లో (Himachal Pradesh) 68 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో అక్టోబర్ 17వ తేదీన ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడగా..నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 25 చివరి తేదీ. అక్టోబర్ 27న నామినేషన్లు పరిశీలించనున్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 19 చివరి తేదీ. నవంబర్ 12న పోలింగ్ జరగనుండగా..డిసెంబర్ 8న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. కాగా ఈ ఎన్నికలను ఒకే విడతలో జరపనున్నట్లు ఈసీ తెలిపింది.
కాగా మొత్తం స్థానాల్లో మెజారిటీ సంఖ్య 35. 2017 సంవత్సరంలో రాష్ట్రంలోని 17 అసెంబ్లీ స్థానాలు షెడ్యూల్డ్ కులాలకు, 3 అసెంబ్లీ నియోజకవర్గాలు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడ్డాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 45, కాంగ్రెస్ 20, ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించారు. 1985 నుంచి హిమాచల్ ప్రదేశ్ లో వరుసగా ఏ పార్టీ గెలవలేదు. హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) అసెంబ్లీ 2023 జనవరి 8తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ (Election Comission) ప్రకటించింది.
అయితే హిమాచల్ లో బీజేపీ , కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ అనూహ్యంగా మేము పోటీలో ఉన్నాం అని ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది. దీనితో హిమాచల్ లో త్రిముఖ పోరు నెలకొంది. మరి ఓట్ల చీలికతో ఏ పార్టీకి నష్టం వాటిల్లితుందో? ఏ పార్టీ అధికారం దక్కించుకుంటుందో చూడాలి మరి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Congress, Himachal Pradesh, Himachal Pradesh Elections 2022