IRDAI: వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) చర్యలు తీసుకుంటోంది. ప్రీమియంలను తగ్గించి మరింత మందికి ఇన్సూరెన్స్(Insurance) ప్రొడక్టులను చేరువ చేసేందుకు కృషి చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రీమియం వ్యాల్యూలో పారదర్శకత కోసం అన్ని కంపెనీలకు ఒకే కామన్ ప్లాట్‌ఫారంను తీసుకొచ్చింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్లకు కమీషన్ల చెల్లింపుపై పరిమితులను ఎత్తివేసింది. దీంతో ఏజెంట్లకు కమీషన్ అందించడంలో లైఫ్, నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు మరింత స్వేచ్ఛ లభించనుంది.
అయితే, కమీషన్‌లు కంపెనీ ఓవరాల్ ఎక్స్‌పెన్సివ్ ఆఫ్ మేనేజ్‌మెంట్(EOM) పరిధిలో ఉండాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు తమ ఏజెంట్లకు కమీషన్లు చెల్లించడానికి బోర్డు ఆమోదించిన లిమిట్స్‌ను అనుసరించాలి. ఈ రెగ్యులేషన్ 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని, మూడేళ్లపాటు అమలులో ఉంటుందని IRDAI తెలిపింది.
* కొత్త IRDAI రూల్ ఏం చెబుతోంది?
IRDAI లైఫ్, నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఎక్స్‌పెన్సెస్ మేనేజ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఏజెంట్లు, బ్రోకర్లు, ఇతర మధ్యవర్తులకు అందించే కమీషన్‌పై లిమిట్ నిర్ణయించాలని కోరింది. రెగ్యులేటర్ వివిధ రకాల మధ్యవర్తులకు వేర్వేరు కమీషన్ చెల్లింపులపై మునుపటి లిమిట్‌ను తొలగించింది. ఓవరాల్ ఎక్స్‌పెన్సివ్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌కి లోబడి కమీషన్ అందజేయాలి. ఈ నిర్ణయం లైఫ్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు తమ ఎక్స్‌పెన్సెస్‌ను ఓవరాల్ లిమిట్‌లో మేనేజ్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ లభిస్తుంది. ఈ ప్రయోజనాలను పాలసీ హోల్డర్‌లకు అందించే అవకాశం ఉంటుంది.
* కంపెనీలు, ఏజెంట్లకు ప్రయోజనం ఏంటి?
ఇన్సూరెన్స్ కంపెనీలు రెగ్యులేటర్ కొత్త నిర్ణయాన్ని స్వాగతించాయి. కీలక సంస్కరణగా పేర్కొన్నాయి. కమీషన్ చెల్లింపులపై లిమిట్ తొలగించడం ఈ రంగంపై సానుకూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు తాము చేసిన మొత్తం ప్రీమియం బిజినెస్‌లో 15 శాతం కమీషన్‌గా మధ్యవర్తులకు చెల్లిస్తున్నాయి. కొత్త రూల్ లిమిట్‌ను తొలగించింది, EOM లిమిట్ మాత్రం అలాగే ఉంటుంది.
ఈ రూల్‌తో కంపెనీ బిజినెస్ బాగుంటే, ఏజెంట్‌కు అధిక కమీషన్ చెల్లించే అవకాశం ఉంటుంది. ఏజెంటుకు కమీషన్ ఇచ్చే స్వేచ్ఛ కంపెనీకి ఉంటుంది. ప్రస్తుతం జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్‌లో EOM లిమిట్ 30 శాతం, హెల్త్ ఇన్సూరెన్స్‌లో 35 శాతంగా ఉన్నాయని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఛైర్మన్, సీఈవో జగన్నాథన్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో చెప్పారు.
Electric Bike : తుక్కుతో ఎలక్ట్రిక్ బైక్ తయారీ.. కొడుకు కోసం చేసిన తండ్రి
* ఎక్స్‌పెన్సెస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అంటే ఏంటి?
ఎక్స్‌పెన్సెస్ ఆఫ్ మేనేజ్‌మెంట్(EOM) కిందకు జనరల్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్, ఇన్సూరెన్స్ ఏజెంట్లు, మధ్యవర్తులకు అందించే కమీషన్‌లు వస్తాయి. ఇందులో కమీషన్, రీఇన్స్యూరెన్స్ ఇన్‌వార్డ్ ఎక్స్‌పెన్సెస్ కూడా ఉంటాయి, ఇవి రెవెన్యూ అకౌంట్‌కు యాడ్ అవుతాయి. బీమా మధ్యవర్తులలో కార్పొరేట్ ఏజెంట్లు, ఇన్సూరెన్స్ బ్రోకర్లు, వెబ్ అగ్రిగేటర్లు, ఇన్సూరెన్స్ మార్కెటింగ్ కంపెనీలు, ఒక సాధారణ ప్రజా సేవా కేంద్రం- SPV ఉంటాయి.
* వినియోగదారులు ఎలాంటి ప్రయోజనం పొందుతారు?
నిబంధనలలో మార్పుల తర్వాత, ఇన్సూరెన్స్ ఏజెంట్లు, ఇన్సూరెన్స్ ప్రోడక్టులను విక్రయించడానికి ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. పాలసీ వివరాలను ముందుగానే వినియోగదారులకు వివరిస్తారు. ఈ ఏజెంట్ల క్లెయిమ్ నిష్పత్తి కూడా మెరుగ్గా ఉంటుంది. ఏజెంట్లకు అధిక కమీషన్లు లభిస్తాయి కాబట్టి పాలసీల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. క్లెయిమ్ అవుట్‌గోలు మొత్తం నిర్వహించదగిన పరిమితిలో ఉన్నప్పుడు, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియంను పెంచకపోవచ్చని, ఇది వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతినిధి జగన్నాథన్ వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.