IRCTC: సాయంత్రం 6 తర్వాత.. రైళ్ల టికెట్ బుకింగ్స్ ప్రారంభం

ప్రత్యేక రైళ్లు, బెర్త్‌లకు సంబంధించిన వివరాలను IRCTC వెబ్‌సైట్లో నమోదు చేస్తున్నామని.. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని ప్రకటనలో తెలిపింది.

news18-telugu
Updated: May 11, 2020, 5:17 PM IST
IRCTC: సాయంత్రం 6 తర్వాత.. రైళ్ల టికెట్ బుకింగ్స్ ప్రారంభం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశవ్యాప్తంగా రేపటి నుంచి రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఎంపిక చేసిన మార్గాల్లో ప్రత్యేక రైళ్లన నడపనుంది రైల్వేశాఖ. ఐతే ఆ ప్రయాణాలకు సంబంధించి ఇవాళ్టి సాయంత్రం 4 గంటల నుంచే టికెట్ బుకింగ్స్ ప్రారంభమవుతాయని తెలిపింది. కానీ IRCTC వెబ్‌పైట్లో గానీ, యాప్‌లో గానీ ఎలాంటి అప్‌డేట్ కాకపోవడంతో ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. సైట్ ఓపెన్ అవ్వక ఇబ్బందులు పడుతున్నారు. అసలు రైలు టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయా? లేదా అన్ని కన్‌ఫ్యూజన్‌ అవుతున్నారు. ఈ క్రమంలోనే ట్రైన్ బుకింగ్స్‌కు సంబంధించి తాజాగా రైల్వేశాఖ ప్రకటన విడుదలచేసింది. ప్రత్యేక రైళ్లు, బెర్త్‌లకు సంబంధించిన వివరాలను IRCTC వెబ్‌సైట్లో నమోదు చేస్తున్నామని.. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని ప్రకటనలో తెలిపింది. ఇక IRCTC వెబ్‌సైట్/యాప్ ఓపెన్ చేస్తే.. అలర్ట్ అంటూ ఓ సందేశం చూపిస్తోంది. సాయంత్రం 6 గంటల నుంచి టికెట్ బుకింగ్స్ ప్రారంభమవుతాయని ఆ సందేశంలో పేర్కొన్నారు.
IRCTC సందేశం



మే 12 నుంచి ప్రయాణికుల రైళ్లను నడపబోతున్నట్లు రైల్వేశాఖ ఇప్పటికే ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి దేశంలోని 15 గమ్యస్థానాలకు ప్రత్యేక రైళ్లను (మొత్తం 30 సర్వీసులు) నడపనుంది. న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్, దిబ్రూగర్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్‌గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావీ రైల్వే స్టేషన్లకు ఈ రైళ్లు వెళ్తాయి. వీటికి ఈనెల 11 (నేడే) సాయంత్రం 4 గంటల నుంచి IRCTCలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. పరిస్థితిని బట్టీ, రైలు బోగీలు అందుబాటులో ఉన్న దాన్ని బట్టీ... దేశంలోని మరిన్ని ప్రాంతాలకు రైళ్లను నడుపుతామని కేంద్రం చెప్పింది.


ప్రత్యేక రైళ్లకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొటోకాల్:

ప్రత్యేక రైళ్ల నిర్వహణకు సంబంధించి కేంద్రహోంశాఖ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొటోకాల్ విడుదల చేసింది. కేంద్రహోంశాఖ, ఆరోగ్యకుటుంబ సంక్షేమశాఖతో సంప్రదింపుల మేరకు రైళ్ల రాకపోకలకు రైల్వేశాఖ అనుమతిస్తుంది.

రైళ్ల షెడ్యూల్, బుకింగ్ ప్రొటోకాల్, రైల్వే స్టేషన్‌లో ప్రవేశం, కోచ్‌లో సీటింగ్‌కు సంబంధించి రైల్వేశాఖ విస్తృతంగా ప్రచారం చేయాలి. ఆన్‌లైన్‌లో ఈ-టికెట్లు కన్‌ఫామ్ అయిన వారికి మాత్రమే రైల్వే స్టేషన్‌లోకి అనుమతించాలి.రైల్వే స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్ చేయాలి. కరోనా వ్యాధి లక్షణాలు లేని వారిని మాత్రమే రైలు ప్రయాణానికి అనుమతించాలి. రైల్వే స్టేషన్ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ వద్ద శానిటైజర్ అందుబాటులో ఉంచాలి.

రైల్వే స్టేషన్ ప్రవేశ ద్వారంతో పాటు ప్రయాణం మొత్తంలో అందరూ మాస్క్ ధరించాలి. ప్రయాణం చేసేటప్పుడు, గమ్యం స్థానం చేరుకున్నాక బయటకు వెళ్లేటప్పుడు అందరూ భౌతిక దూరం పాటించాలి. గమ్యస్థానం చేరుకున్న సదరు రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా ప్రొటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది.
Published by: Shiva Kumar Addula
First published: May 11, 2020, 5:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading