IRCTC TO INTRODUCE SATTVIC FOOD FOR PURE VEGETARIANS IN LONG DISTANCE TRAINS UMG GH
IRCTC Sattiv Food: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ట్రైన్లో సూపర్ ఫుడ్.. ఇస్కాన్‌తో ఐఆర్సీటీసీ ఒప్పందం
రైలు ప్రయాణాల్లో శాకాహారులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్.
సుదూర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులకు (Tran Passengers) ఐఆర్సీటీసీ (IRCTC) గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి శాకాహారం(Sattiv Food) అందించడం కోసం ఇస్కాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఇస్కాన్ టెంపుల్‌కు సంబంధించిన గోవిందా రెస్టారెంట్ నుంచి ఫుడ్ అందించనున్నారు. ఈ ఫుడ్ కోసం రైలు లోపల నుంచే ఆర్డర్ ఇవ్వవచ్చు.
సుదూర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులకు ఐఆర్సీటీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి శాకాహారం(Sattiv Food) అందించడం కోసం ఇస్కాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఇస్కాన్ టెంపుల్‌కు సంబంధించిన గోవిందా రెస్టారెంట్ నుంచి ఫుడ్ అందించనున్నారు. ఈ ఫుడ్ కోసం రైలు లోపల నుంచే ఆర్డర్ ఇవ్వవచ్చు.
మెను ఇలా..
పూర్తిగా శాకాహారం అందిస్తారు. ఇందులో సీజనల్‌కు సంబంధించిన తాజా పండ్లు, తాజా కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, బీన్స్ మొలకలు ఉంటాయి. అలాగే సాత్విక ఫుడ్ మెనులో డీలక్స్ థాలీ, మహారాజా థాలీ, పురాణి ఢిల్లీ వెజిటబుల్ బిర్యానీ, వెజిటేబుల్ డిమ్ సమ్, పనీర్ డిమ్ సమ్, దాల్ మఖానీ తదతర వెరైటీస్ కూడా అందుబాటులో ఉండనున్నాయి.
మొదటి దశ - హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్
IRCTC, ఇస్కాన్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. మొదటి దశలో ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుండి అందుబాటులోకి రానుంది. సమీప భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఉన్న ఇతర స్టేషన్లలో కూడా దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది. మొదటి దశలో మంచి స్పందన లభిస్తే, దేశంలోని ఇతర రైల్వే స్టేషన్లకు కూడా విస్తరింపజేస్తామని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
ఐఆర్సీటీసీ యాప్‌తో బుకింగ్
దూర ప్రయాణాలు చేసే సందర్భాల్లో పూర్తిగా శాకాహారం తినే ప్రయాణికులు ఆహారం విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఐఆర్సీటీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కొంతమంది ప్రయాణీకులు ప్యాంట్రీ కార్ నుండి వచ్చిన ఆహార స్వచ్ఛతపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఆ ఆహారాన్ని తీసుకోవడం లేదు. దీంతో సాత్విక ఆహారాన్ని(Sattiv Food) అందించడం ద్వారా ఈ సమస్యలను చెక్ పెట్టవచ్చని ఐఆర్సీటీసీ భావిస్తోంది. ప్రయాణికులు IRCTC ఇ-క్యాటరింగ్ వెబ్సైట్ లేదా IRCTC యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
ఇది ఇలా ఉంటే.. ఆన్లైన్ టికెట్ బుకింగ్ సంబంధించి ఐఆర్సీటీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా ఫ్యామిలీ మొత్తం కలిసి ఎక్కడైనా రైల్లో ప్రయాణం చేద్దామంటే ఆన్లైన్లో టికెట్ల బుకింగ్ కోసం ఇప్పటి వరకు రెండు లేదా మూడు యూజర్ ఐడీలు ఉపయోగించాల్సిన పరిస్థితి ఉండేది. ఒకవేళ ఆధార్ అనుసంధానం చేసినా 12 టికెట్ల వరకు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉండేది. దీంతో కుటుంబం మొత్తం రైలులో వెళ్లాలనుకునే వారికి ఇది చాలా నిరుత్సాహపరిచేది. అయితే తాజాగా ఇలాంటి వారి కోసం ‘ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)’ ఇటీవల ఓ శుభవార్త చెప్పింది. ఒక నెలలో ఆన్లైన్ లేదా యాప్ ద్వారా బుక్ చేసుకునే టికెట్ల సంఖ్య పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఆధార్ అనుసంధానం చేయని ఒక యూజర్ ఐడీ ద్వారా ఒక నెలలో 12 టికెట్ల వరకు బుక్ చేసుకోవచ్చని ఐఆర్సీటీసీ తెలిపింది. ప్రస్తుతం ఇది ఆరు టికెట్లకే పరిమితమైంది. మరోవైపు ఆధార్ అనుసంధానం చేసిన యూజర్ ఐడీ ద్వారా ప్రస్తుతం 12 టికెట్ల వరకు బుక్ చేసుకునేందుకు అనుమతి ఉంటే ఆ పరిమితిని ఇప్పుడు 24 వరకు పెంచింది.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.