IRCTC: రైలు ప్రయాణికులకు శుభవార్త...ఇకనుంచి ఎక్కే స్టేషన్ మార్చుకునే సదుపాయం

ఒకసారి బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకున్న తర్వాత, ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే.. మాత్రం ఎలాంటి ఛార్జీలను వెనక్కి ఇచ్చేది లేదని కండిషన్స్ పెట్టింది రైల్వే శాఖ.

news18-telugu
Updated: May 6, 2019, 9:29 AM IST
IRCTC: రైలు ప్రయాణికులకు శుభవార్త...ఇకనుంచి ఎక్కే స్టేషన్ మార్చుకునే సదుపాయం
ఇక నుంచి irctcలో ఎక్కే స్టేషన్ మార్చుకునే సదుపాయం
  • Share this:
రైలు ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది ఐఆర్‌సీటీసీ. ఇక నుంచి ప్రయాణికులు బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకునే సౌలభ్యాన్ని తీసుకొచ్చింది. ఎవరైనా సరే రిజర్వేషన్ చేయించుకున్న తర్వాత ఎక్కే స్టేషన్ మార్చుకోవాలంటూ కనీసం 24 గంటల సమయం పడుతోంది. బోర్డింగ్ స్టేషన్‌లో మనం రైలు ఎక్కకుంటే మనం చేసుకున్న రిజర్వేషన్ క్యాన్సిల్ అవుతోంది. పనిమీద పక్క ఊరికి వెళ్లి...అటు నుంచి రైలు వస్తుంది కదా అని ఆ రైలు ఎక్కేద్దామంటే ఇప్పటివరకు ఛాన్స్ లేదు. కానీ రైల్వే శాఖ ఇక నుంచి ప్రయాణికుల కోసం ఆవెసులుబాటు కూడా కల్పిస్తోంది.

ఐఆర్‌సీటీసీలో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్‌ను చార్టు తయారీ ముందు వరకు మార్చుకునే సదుపాయం ఇప్పుడు రైల్వే అధికారులు కల్పిస్తున్నారు. అయితే ఆన్ లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్నవారికి మాత్రమే ఈ ఛాన్స్ ఉంటుంది. స్టేషన్ కౌంటర్లలో టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులకు ఈ అవకాశం ఇప్పుడే లభించదు అంటున్నారు అధికారులు.

ముందుగా irctc వెబ్ సైట్‌లో ఐడీ పాస్ వార్డ్ లాగిన్ అయ్యి .... బుకింగ్ టికెట్ హిస్టరీలోకి వెళ్లారు. రైలును ఎంచుకొని బోర్డింగ్ పాయింట్ మార్చుకునే సదుపాయాన్న అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే శాఖ తెలిపింది. స్టేషన్ మార్చుకునే ప్రయాణికులకు, రెండు స్టేషన్లకూ మధ్య ఉన్న దూరానికి రైలు ఛార్జీ వెనక్కి రాదని స్పష్టం చేసింది. అయితే ఒకసారి బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకున్న తర్వాత, ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే.. మాత్రం ఎలాంటి ఛార్జీలను వెనక్కి ఇచ్చేది లేదని కండిషన్స్ పెట్టింది రైల్వే శాఖ. మొత్తం మీద కొత్త కొత్త సదుపాయాలు కల్పిస్తూ... ప్రయాణికులు ఆకట్టుకునే పనిలో పడింది irctc.

First published: May 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు