ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం... ఏప్రిల్ 30 వరకు బుకింగ్స్ రద్దు

IRCTC: రైల్వే టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సదుపాయాన్ని ఏప్రిల్ 30 వరకూ రద్దు చేస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ ప్రకటించింది.

news18-telugu
Updated: April 7, 2020, 7:17 PM IST
ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం... ఏప్రిల్ 30 వరకు బుకింగ్స్ రద్దు
మే 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి IRCTC వెబ్ సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
  • Share this:
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అమలు చేస్తున్న లాక్ డౌన్‌ను మరికొన్ని వారాలు కొనసాగించాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. కేంద్రం కూడా ఈ దిశగానే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ రైల్వే శాఖ అనుబంధ సంస్థ అయిన ఐఆర్‌సీటీసీ తీసుకున్న నిర్ణయంతో లాక్‌డౌన్ పొడిగింపుపై పరోక్ష సంకేతాన్ని ఇచ్చినట్టు కనిపిస్తోంది. రైల్వే టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సదుపాయాన్ని ఏప్రిల్ 30 వరకూ రద్దు చేస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులు తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది.

ఐఆర్‌సీటీసీ ఈ నెలాఖరు వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన వినిపిస్తోంది. రైల్వే టికెట్ల బుకింగ్స్‌తో పాటు ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ తేజస్ ఎక్స్‌ప్రెస్ పేరుతో మూడు రైళ్లను నడుపుతోంది. వీటిలో ఢిల్లీ నుంచి లక్నో, అహ్మదాబాద్ నుంచి ముంబై మార్గాల్లో ప్రయాణించే రైళ్లు ఉన్నాయి.

First published: April 7, 2020, 7:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading