IRCTC ANNOUNCED THAT TRAIN TICKET BOOKING IS AFFECTED DUE TO TECHNICAL ISSUE ON WEBSITE HERE DETAILS NS
Indian Railways: రైల్వే టికెట్ బుకింగ్ సేవల్లో అంతరాయం.. IRCTC కీలక ప్రకటన.. పూర్తి వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ట్రైన్ టికెట్ బుకింగ్ లో సమస్యలు తలెత్తాయి. దీంతో టికెట్ బుక్ చేసుకోవాలని ప్రయత్నించిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ విషయంపై ఇండియన్ రైల్వేస్ స్పందించింది.
కరోనా ఎఫెక్ట్ రైల్వేపై విపరీతంగా పడింది. కరోనా ప్రారంభంలో బంద్ అయిన సర్వీసులు అన్ లాక్ అనంతరం కొద్ది మేర ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైల్వే సర్వీసులను నడుపుతోంది. ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే ప్రయాణించేలా నిబంధనలను మార్చింది. అయితే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ రోజు బుకింగ్ లో సమస్యలు తలెత్తాయి. దీంతో టికెట్ బుక్ చేసుకోవాలని ప్రయత్నించిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ విషయంపై ఇండియన్ రైల్వేస్ స్పందించింది. సాంకేతిక సమస్యల కారణంగా IRCTC వెబ్ సైట్లో బుకింగ్ చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తయని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. సమస్యను సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని తెలిపింది.
అయితే ఈ విషయంపై అనేక మంది ప్రయాణికులు స్పందించి కామెంట్లు పెడుతున్నారు. IRCTC Appలోనూ ఇలాంటి సమస్యలే తలెత్తుతున్నాయని పలువురు పోస్టుల చేశారు. ఉదయం నుంచి ఇలాంటి సమస్యలే ఎదురవుతున్నాయని పలువురు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.
Booking is affected due to some technical issue on website. We are working on it and it will get resolved soon.
ఇదిలా ఉంటే.. భారతీయ రైల్వే తన మొదటి ఎయిర్ కండీషన్డ్ త్రీ టైర్ ఎకానమీ క్లాస్ కోచ్‌ను ప్రారంభించింది. ప్రపంచంలోకెల్లా అత్యంత చౌకైన, ఉత్తమమైన ఏసీ ప్రయాణాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో దీన్ని ప్రారంభించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కోచ్‌లలో ఛార్జీలు ఏసీ త్రీ-టైర్, నాన్- ఏసీ స్లీపర్ క్లాస్ మధ్య ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. కొత్తగా రూపొందించిన ఈ కోచ్‌ను కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సిఎఫ్) కపుర్తల నుండి రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) లక్నో మధ్య ట్రయల్ రన్ కోసం సిద్ధంగా ఉంచారు. ఇది రైల్ కోచ్ ఫ్యాక్టరీ(ఆర్‌సిఎఫ్) చేత రూపొందించబడింది. రైళ్లలో ఈ నూతన ఎస్3 టైర్ ఎకానమీ కోచ్‌లను చేర్చడం ద్వారా ప్రస్తుతం 72గా ఉన్న బెర్త్‌ల సంఖ్య 83కి పెరగనుంది.