CBI New Director: సీబీఐ కొత్త డైరెక్టర్‌గా సుభోద్ కుమార్ జైస్వాల్

సుభోద్ కుమార్ జైస్వాల్ (ఫైల్ ఫోటో)

CBI New Director: 1985 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సుభోద్ కుమార్ జైస్వాల్.. ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.

  • Share this:
    సీబీఐ కొత్త డైరెక్టర్ ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. ఇందుకోసం ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ప్రతిపక్ష నేత అధీర్‌లతో కూడిన కమిటీ అనేక మంది పేర్లను పరిశీలించింది. అయితే చివరకు ఇందుకోసం కమిటీ సుభోద్ కుమార్ జైస్వాల్‌ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు కేంద్రం ఆయన పేరు అధికారికంగా ప్రకటించింది. 1985 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సుభోద్ కుమార్ జైస్వాల్.. ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.

    1962 సెప్టెంబర్ 22న జన్మించిన సుభోద్ కుమార్.. గతంలో మహారాష్ట్ర డీజీపీగానూ పని చేశారు. అంతకుముందు ముంబై పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. దేశ గూఢచార వ్యవస్థ రా(రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్)లోనూ తొమ్మిదేళ్ల పాటు పని చేసిన అనుభవం జైస్వాల్ సొంతం. రీసెర్చ్ అండ్ అనాలసిస్ విం‌గ్‌లో పని చేసిన సమయంలోనే ఆ సంస్థ అడిషినల్‌ సెక్రటరీగా మూడేళ్ల పాటు పని చేశారు సుభోద్ కుమార్ జైస్వాల్.
    Published by:Kishore Akkaladevi
    First published: