ఇందిరాగాంధీని అరెస్ట్ చేసిన ఐపీఎస్ కన్నుమూత

1951 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన వీఆర్ లక్ష్మీనారాయణ్ మధురై ఏఎస్పీగా తన కెరీర్ ప్రారంభించారు. 1985లో తమిళనాడు డీజీపీగా రిటైర్ అయ్యారు.

news18-telugu
Updated: June 23, 2019, 5:11 PM IST
ఇందిరాగాంధీని అరెస్ట్ చేసిన ఐపీఎస్ కన్నుమూత
వీఆర్ లక్ష్మీనారాయణ్ (File:Image Credit: Deccan Herald)
  • Share this:
మాజీ ప్రధాని ఇందిరాగాంధీని అరెస్ట్ చేసి అప్పట్లో సంచలనం సృష్టించిన ఐపీఎస్ అధికారి వీఆర్ లక్ష్మీనారాయణ్ కన్నుమూశారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. దేశంలో అత్యవసర పరిస్థితి తర్వాత ఇందిరాగాంధీ మీద అవినీతి ఆరోపణల కేసులో అప్పటి సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మీనారాయణ్ అరెస్ట్ చేశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. లక్ష్మీనారాయణ్ తమిళనాడు డీజీపీగా రిటైర్డ్ అయ్యారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. 1951 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన వీఆర్ లక్ష్మీనారాయణ్ మధురై ఏఎస్పీగా తన కెరీర్ ప్రారంభించారు. 1985లో తమిళనాడు డీజీపీగా రిటైర్ అయ్యారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. 1977లో అప్పటి సీబీఐ జేడీగా ఉన్న వీఆర్ లక్ష్మీనారాయణ్ ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు. లక్ష్మీనారాయణ్ అంత్యక్రియలు మంగళవారం జరగనున్నాయి.

First published: June 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు