కశ్మీర్ లోయలో కల్లోలం...మరోసారి ఇంటర్నెట్ సేవలు బంద్

కాశ్మీర్ లో పలు సంస్థలు బంద్‌కు పిలుపునివ్వడంతో.. ఎలాంటి ఆందోళనలు చెలరేగకుండా ఇంటర్నెట్‌ను నిషేధించింది.

news18-telugu
Updated: February 9, 2020, 10:28 PM IST
కశ్మీర్ లోయలో కల్లోలం...మరోసారి ఇంటర్నెట్ సేవలు బంద్
కాశ్మీర్ లో పలు సంస్థలు బంద్‌కు పిలుపునివ్వడంతో.. ఎలాంటి ఆందోళనలు చెలరేగకుండా ఇంటర్నెట్‌ను నిషేధించింది.
  • Share this:
కల్లోల ప్రాంతమైన కాశ్మీరులో కేంద్ర ప్రభుత్వం మరోసారి ఇంటర్నెట్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరి తీసిన రోజు సందర్భంగా వేర్పాటువాదులు ఆదివారం బంద్‌కు పిలుపునివ్వడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అల్లర్లు జరిగే అవకాశం ఉందనే పసిగట్టిన నిఘా వర్గాలు హెచ్చరించడంతో, ఆదివారం ఉదయం నుంచే ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత కేంద్రం ఐదు నెలల పాటు జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించిందింది. కాగా జనవరి 25 నుంచి నిషేధాన్ని ఎత్తేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాగా అఫ్జల్ గురు మరణ శిక్ష విధించిన రోజున బంద్‌కు పిలుపునివ్వడంతో.. ఎలాంటి ఆందోళనలు చెలరేగకుండా ఇంటర్నెట్‌ను నిషేధించింది.

First published: February 9, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు