INTERNATIONAL YOGA DAY BJP MP PERFORMS YOGA INSIDE RING OF FIRE IN RAJASTHAN
Yoga Day 2020: అగ్ని వలయం మధ్యలో బీజేపీ ఎంపీ వినూత్న యోగాసనాలు
అగ్ని వలయం మధ్యలో కూర్చొని యోగాసనాలు వేస్తున్న బీజేపీ ఎంపీ సుఖ్బీర్ సింగ్
International Yoga Day | రాజస్థాన్‌కు చెందిన బీజేపీ ఎంపీ సుఖ్బీర్ సింగ్ మండుటెండలను కూడా లెక్క చేయకుండా అగ్ని వలయం మధ్యలో అర్థ నగ్నంగా కూర్చున్నారు. ఒంటి నిండా బురద మట్టిని రుద్దుకున్నారు. ‘ఓం నమశ్శివాయ’ మంత్రజపం చేస్తూ యోగాసనాలు వేశారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాజస్తాన్ బీజేపీ ఎంపీ సుఖ్బీర్ సింగ్ వినూత్నంగా యోగా ఆసనాలు వేశారు. మండుటెండలను కూడా లెక్క చేయకుండా అగ్ని వలయం మధ్యలో అర్థ నగ్నంగా కూర్చున్నారు. ఒంటి నిండా బురద మట్టిని రుద్దుకున్నారు. ‘ఓం నమశ్శివాయ’ మంత్రజపం చేస్తూ యోగాసనాలు వేశారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టోంక్ - సవై మధోపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి సుఖ్బీర్ సింగ్ ప్రాతినిధ్యంవహిస్తున్నారు. మట్టి స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదని ఎంపీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమన్న ఆయన...తాను రోజూ 3-4 గం.ల పాటు యోగా, ధ్యానం, వ్యాయామానికి కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఫలితంగా గత 4 మాసాల్లో తాను ఏకంగా 25 కేజీల బరువు తగ్గినట్లు ఆయన చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా దేశ యువకులు సైక్లింగ్, యోగా, వ్యాయామంను అలవరుచుకోవాలని, ప్రతి రోజూ కనీసం 1-2 గం.లు దీనికి కేటాయించాలన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 6వ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. దేశంలో ‘యోగా ఎట్ హోమ్ అండ్ యోగా విత్ ఫ్యామిలి' పేరిట ఈ ఏడాది యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలంతా యోగా దినోత్సవాన్ని వారివారి ఇంటివద్దే జరుపుకున్నారు. దేశ ప్రజలను యోగా ఏకం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.