Home /News /national /

INTERNATIONAL YOGA DAY 2022 YOGA FOR HUMANITY THIS YEAR THEME PM MODI TO LEAD FROM MYSURU 25 CR PEOPLE MAY JOIN GLOBALLY MKS

Int’l Yoga Day 2022 : నేడే యోగా డే -మైసూరులో PM Modi లీడ్ -గ్లోబల్‌గా 25కోట్ల మంది -థీమ్‌ ఇదే..

యోగా డే 2022 థీమ్, పీఎం మోదీ యోగా(పాత ఫొటో)

యోగా డే 2022 థీమ్, పీఎం మోదీ యోగా(పాత ఫొటో)

శారీరక, మానసిక వికాసానికి దోహదపడే యోగాపై ప్రపంచ ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తూ, అదే సమయంలో మానవాళికి సందేశమిస్తూ నేడు (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొంటున్నారు.

ఆథ్యాత్మిక సాధానతోపాటు శారీరక వ్యాయామంగానూ పురాతన కాలంగా భారత్ నిలుపుకొంటూ వచ్చిన యోగాను గత కొన్నేళ్లుగా ప్రపంచం మొత్తం అనుసరిస్తున్నది. శారీరక, మానసిక వికాసానికి దోహదపడే యోగాపై ప్రపంచ ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తూ, అదే సమయంలో మానవాళికి సందేశమిస్తూ నేడు (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga Day 2022) ఘనంగా జరుపుకొంటున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చొరవతో 175 దేశాల ఆమోదంతో ఐక్యరాజ్యసమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2015లో ప్రకటించడం, అప్పటి నుంచి యోగా డే మరింత అట్టహాసంగా జరుపుకోవడం తెలిసిందే.


CM KCR | Centre : రూ.40వేల కోట్ల తెలంగాణ భూములు అమ్ముకోనున్న కేంద్రం: KTR ఘాటు లేఖ


ఉత్తరార్థగోళంలో పగటి సమయం ఎక్కువగా ఉండే జూన్ 21నే వ్యూహాత్మకంగా ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహిస్తుండటం గమనార్హం. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ యోగా దినోత్సవంలో పాల్గొంటాయి. సాధారణ అంచనా ప్రకారం నేటి యోగా డేలో భారత్ కాకుండా గ్లోబల్ గా కనీసం 25 కోట్ల మంది ప్రజలు పాల్గొంటారు.


Eatala Rajender : కాంగ్రెస్ నేత కారులో ఈటల.. Amit Shah హామీ ఇచ్చిన కీలక పదవి ఇదే!


ఇక దేశంలోనూ అన్ని నగరాలు, జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కర్ణాటకలోని మైసూర్‌లో జరిగే ప్రధాన వేడుకను దేశ ప్రధాని నరేంద్ర మోదీ లీడ్ చేయనున్నారు. ప్రఖ్యాత మైసూరు ప్యాలెస్ లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ 1000 మంది స్కూలు విద్యార్థులతో కలిసి 45 నిమిషాలపాటు 20 యోగాసనాలు వేస్తారు. ఈ కార్యక్రమానికి 15 వేల మంది హాజరవుతారని అంచనా.


AP Debts | CAG : జగన్ సర్కారు అప్పులు తక్కువే! -కాగ్ రిపోర్టులో అనూహ్య లెక్కలు..


దేశవ్యాప్తంగా ఘన చరిత్ర కలిగిన 75 వారసత్వ కట్టడాల వద్ద జరిగే వేడుకల్లో కేంద్ర మం త్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో మంగళవారం ఉదయం 5.30 గంటలకు ప్రారంభమయ్యే యోగా వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 50 వేల మంది వస్తారని అంచనా. కోయంబత్తూర్‌లో జరిగే ఈవెంట్ లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పాల్గొంటారు.



దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశంలో 75 వేల చోట్ల యోగా వేడుకలు నిర్వహిస్తున్నట్టు బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది తెలిపారు. పార్టీలు, ప్రాంతాలు, మతాలు, దేశాలకు అతీతంగా ‘యోగా ఫర్‌ హ్యుమానిటీ’ థీమ్‌తో ఈసారి యోగా డే జరగనుంది.
Published by:Madhu Kota
First published:

Tags: Mysur, Pm modi, Yoga, Yoga day

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు