INTERNATIONAL YOGA DAY 2022 UPDATES YOGA BRINGS PEACE WITHIN US THAT CONNECTS WORLD SAYS PM MODI IN MYSURU MKS
PM Modi | Yoga Day 2022 : యోగాతో మనశ్శాంతి.. దాంతో విశ్వ శాంతి : మోదీ సందేశమిదే..
మైసూరులో పీఎం మోదీ యోగా డే సందేశం
యోగా మనకు శాంతిని కలిగిస్తుందని, యోగా వల్ల కలిగే శాంతి వ్యక్తులకు మాత్రమే కాదు, దేశాలకు, ప్రపంచానికీ శాంతిని తెస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా మైసూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day 2022) సందర్భంగా నేడు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో యోగా సాధన జరుగుతోందని, యోగా మనకు శాంతిని కలిగిస్తుందని, యోగా వల్ల కలిగే శాంతి వ్యక్తులకు మాత్రమే కాదు, దేశాలకు, ప్రపంచానికీ శాంతిని తెస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చెప్పారు.
కర్ణాటకలోని మైసూరులో ఇవాళ జరిగిన ప్రధాన ఈవెంట్ లో పీఎం మోదీ 15వేల మందితో కలిసి 45 నిమిషాలపాటు యోగా చేశారు. మొత్తం 20 ఆసనాలు వేశారు. అంతకు ముందు, ప్రపంచాన్ని ఉద్దేశించి సందేశమిచ్చిన ఆయన.. యోగా డేకు గుర్తింపునిచ్చిన ఐక్యరాజ్యసమితికి, యోగా డేలో పాలుపంచుకుంటోన్న దేశాలు అన్నిటికీ కృతజ్ఞతలు తెలిపారు. మైసూర్ అధ్యాత్మికానికి కేంద్రమని, ఒకప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాల్లో మాత్రమే యోగా చేసేవాళ్లని, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యోగా చేస్తున్నారని మోదీ పేర్కొన్నారు.
‘యోగా ఫర్ హ్యుమానిటీ’ థీమ్‌తో ఈ ఏడాది యోగా డే జరుగుతున్నది. దేశవ్యాప్తంగా ఘన చరిత్ర కలిగిన 75 వారసత్వ కట్టడాల వద్ద జరిగే వేడుకల్లో కేంద్ర మం త్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు యోగా చేశారు. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవంలో 25 కోట్ల మంది పాల్గొంటారని అంచనా.
ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో 175 దేశాల ఆమోదంతో ఐక్యరాజ్యసమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2015లో ప్రకటించడం, అప్పటి నుంచి యోగా డే మరింత అట్టహాసంగా జరుపుకోవడం తెలిసిందే. ఉత్తరార్థగోళంలో పగటి సమయం ఎక్కువగా ఉండే జూన్ 21నే వ్యూహాత్మకంగా ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహిస్తుండటం గమనార్హం.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.