Home /News /national /

INTERNATIONAL WOMENS DAY ON THE OCCATION OF WOMENS DAY PRESIDENT PRIME MINISTER MANY OTHER LEADERS CONVEY BEST WISHES TO WOMEN NK

Women's day 2021: మహిళా దినోత్సవాన... రాష్ట్రపతి, ప్రధాని సహా నేతల శుభాకాంక్షలు

రామ్ నాథ్ కోవింద్, నరేంద్ర మోదీ (File)

రామ్ నాథ్ కోవింద్, నరేంద్ర మోదీ (File)

International Women's day 2021: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా... మహిళలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. నేతలు ఎవరు ఏమన్నారో తెలుసుకుందాం.

    International Women's day 2021: మహిళలంటే అందరికీ గౌరవమే. వారి కోసం ప్రత్యేక రోజును కేటాయించి... ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పుకోవడానికీ... వారి త్యాగాలు, గొప్పదదాన్ని ప్రపంచానికి చాటేందుకూ... వారి హక్కులను కాపాడేందుకూ... ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్... దేశ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో మహిళలు అనేక రంగాల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పారని ట్విట్టర్ ద్వారా తెలిపారు. మహిళలు, పురుషుల మధ్య అసమానతలు తొలగేందుకు మనం అందరం కలిసి కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.


    మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... ప్రత్యేక ట్వీట్ చేశారు. దేశంలో మహిళలు సాధిస్తున్న విజయాలు చూసి... ఎల్లప్పుడూ గర్వ పడుతున్నట్లు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో సాధికారత సాధించేలా... ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.


    ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే... వివిధ రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాల్ని గుర్తించి... ప్రశంసిస్తారు. 1996 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని థీమ్‌తో జరుపుతున్నారు. ఆ సంవత్సరం ఐక్య రాజ్య సమితి... ఓ థీమ్ తెచ్చింది అది... గతాన్ని సెలబ్రేట్ చేసుకుందాం... భవిష్యత్‌కు ప్లాన్ వేసుకుందాం. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఏటా ప్రత్యేక థీమ్‌తో మహిళా దినోత్సవం జరుగుతోంది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Narendra modi, Ramnath kovind, Womens day 2021

    తదుపరి వార్తలు