Home /News /national /

INTERNATIONAL MUSEUM DAY 2021 YOU MUST VISIT THESE FIVE MUSEUMS ONCE PANDEMIC RESTRICTIONS ARE EASED GH SK

Museum day: లాక్‌డౌన్ ముగిసిన తర్వాత.. మన దేశంలో చూడాల్సిన 5 మ్యూజియాలు ఇవే

సాలర్జంగ్ మ్యూజియం (Image:SalarjungMuseum)

సాలర్జంగ్ మ్యూజియం (Image:SalarjungMuseum)

మే నెల 18న ఈ ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యూజియం డే పుర‌స్క‌రించుకొని భార‌త‌దేశంలోని ఐదు ప్ర‌త్యేక‌మైన మ్యూజియంల గురించి తెలుసుకుందాం. త‌ప్ప‌నిస‌రిగా సంద‌ర్శించాల్సిన ఈ మ్యూజియంల‌ను క‌రోనా నిబంధ‌న‌లు స‌డ‌లించిన త‌ర్వాత చూడొచ్చు.

నేడు (మే 18) ఇంటర్నేషనల్ మ్యూజియం డే. మ్యూజియం త‌రాల మ‌ధ్య మార్పుల‌ను తెలియ‌జేసే అద్భుత‌మైన సాంస్కృతి ప్ర‌దేశం. ఇక్క‌డ వార‌స‌త్వం ప‌దిల‌ప‌ర‌చ‌బ‌డుతుంది. మ్యూజియం అభ్యాసాన్ని ప్రోత్స‌హిస్తుంది. అలాగే మాన‌వీయ విలువ‌ల‌ను ప‌రివ్యాపింప‌జేస్తుంది. అంతేకాదు, సంస్కృతిని అర్థం చేసుకోవ‌డానికి ఈ ప్ర‌ద‌ర్శ‌న‌శాల‌ అంద‌రికీ స‌మాన అవ‌కాశాన్ని అందిస్తుంది. ప్ర‌స్తుతమున్న క‌రోనా క‌ట్ట‌డి వ‌ల్ల మ్యూజియంలు త‌ప్ప‌నిస‌రిగా మూసేయాల్సి వ‌చ్చింది. అయితే దీని స్ఫూర్తి మాత్రం కోన‌సాగింప‌బ‌డుతూనే ఉంటుంది. ఒక్క‌సారి ఈ క‌రోనా క్లిష్ట‌కాలం ముగిసిన త‌ర్వాత మ‌నమంతా మ‌న జాతి సంస్కృతిని నిక్షిప్తం చేసిన మ్యూజియాల‌ను తిరిగి సంద‌ర్శించ‌డానికి వీలు క‌లుగుతుంది.

మే నెల 18న ఈ ఇంట‌ర్నేష‌న‌ల్ మ్యూజియం డే పుర‌స్క‌రించుకొని భార‌త‌దేశంలోని ఐదు ప్ర‌త్యేక‌మైన మ్యూజియంల గురించి తెలుసుకుందాం. త‌ప్ప‌నిస‌రిగా సంద‌ర్శించాల్సిన ఈ మ్యూజియంల‌ను క‌రోనా నిబంధ‌న‌లు స‌డ‌లించిన త‌ర్వాత చూడొచ్చు.

1. ఇండియ‌న్ మ్యూజియం, కోల్‌క‌తాః
దీన్ని 1814లో స్థాపించారు. ప‌శ్చిమ బెంగాల్‌లోని కోల్‌క‌తాకు చెందిన‌ ఈ ఇండియ‌న్ మ్యూజియం భార‌త‌దేశంలోనే అతి పెద్దది, పురాత‌న‌మైనదిగా పేరుగాంచింది. అంతేకాదు, ఆసియా-ఫ‌సిఫిక్ ప్రాంతంలోనే అతిపెద్ద బ‌హుళార్థ‌క‌సాధ‌న మ్యూజియంగా దీనికి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది.నిర్మాణప‌రంగానూ ఇండియ‌న్ మ్యూజియం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో 35 గ్యాల‌రీలు ఉంటాయి. అరుదైన పురాత‌న వ‌స్తువులు, క‌వ‌చాలు, ఆభ‌ర‌ణాలు, శిలాజాలు, అస్థిపంజారాలు, మ‌మ్మీలు, మొఘ‌లుల చిత్ర‌లేఖ‌నాలకు ఈ మ్యూజియం ఆవాసంగా నిలుస్తుంది. మ్యూజియంల‌పైన మంచి ఆస‌క్తి ఉన్న‌వారెవ్వ‌రూ దీన్ని సంద‌ర్శించ‌కుండా ఉండ‌లేరు.

2. నేష‌న‌ల్ మ్యూజియం, ఢిల్లీః
ఈ నేష‌న‌ల్ మ్యూజియం ఢిల్లీలోని జ‌న‌ప‌థ్ ద‌గ్గ‌ర ఉంది. దేశంలోనే అత్యంత ప్ర‌సిద్ధిచెందిన మ్యూజియంల‌లో ఇదీ ఒక‌టి. ఈ నేష‌న‌ల్ మ్యూజియం స్థాపించ‌డం వెనుక ఒక ఆస‌క్తిక‌ర‌మైన నేప‌థ్యం ఉంది. బ్రిటీస్‌వారి నుంచి భార‌త‌దేశం స్వాతంత్రం పొంద‌కు ముందు, బ‌ర్లింగ్‌ట‌న్ హౌస్‌లో లండ‌న్ రాయ‌ల్ అకాడ‌మి ఒక ప్ర‌ద‌ర్శ‌న‌శాల‌ను నిర్వ‌హించింది. ఇందులో భార‌త‌దేశంలోని వివిధ మ్యూజియంల నుంచి ఎంపిక‌చేసి తీసుకొచ్చిన క‌ళాఖండాల‌ను ప్ర‌ద‌ర్శ‌న‌కు పెట్టారు. ఆ త‌ర్వాత‌, అవే క‌ళాఖండాల‌తో ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ఒక ఎగ్జిబిష‌న్‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మం ఎంతో విజ‌య‌వంతమ‌య్యింది. దీని ఫ‌లితంగా, ఒక నేష‌న‌ల్ మ్యూజియంను స్థాపించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇప్ప‌టికి నేష‌న‌ల్ మ్యూజియంలో దాదాపు రెండు ల‌క్ష‌ల వ‌స్తువులు ఉన్నాయి. వీటిలో విభిన్న స్వ‌భావాలున్న‌ స్వ‌దేశీ, విదేశీ వ‌స్తువులున్నాయి. ఇందులో ఉన్న హోల్డింగ్లు ఐదు వేల సంవ‌త్స‌రాల భార‌తీయ సాంస్కృతిక వార‌స‌త్వాన్ని క‌లిగి ఉన్నాయి. మీరు చారిత్ర‌క విష‌యాల ప‌ట్ల మ‌క్కువగ‌ల‌వారైతే జీవితంలో ఒక్క‌సారైనా ఈ మ్యూజియంను సంద‌ర్శించాలి.

3. సాలార్జంగ్ మ్యూజియం, హైద‌రాబాద్ః
భార‌త‌దేశంలోని మూడు ఐకానిక్ నేష‌న‌ల్ మ్యూజియంల‌లో సాలార్జంగ్ మ్యూజియం ఒక‌టిగా గుర్తింపును పొందింది. తెలంగాణా రాష్ట్రంలోని హైద‌రాబాద్‌లో మూసీ న‌ది ద‌క్షిణం ఒడ్డున ఇది ఉంది. ఈ మ్యూజియంలో 43 వేల క‌ళా వ‌స్తువులు (Art Objects), 50 వేల పుస్త‌కాలు, రాత‌ప్ర‌తులు ఉన్నాయి. ఇక్క‌డున్న హోల్డింగ్‌లలో భార‌తీయ క‌ళ‌, మిడిల్ ఈస్ట్ ఆర్ట్‌, ఫార్ ఈస్ట్ ఆర్ట్‌, యురోపియ‌న్ ఆర్ట్, అలాగే బాల‌ల క‌ళ‌ల నుంచి తీసుకున్న‌వి ఉంటాయి. అర్థ‌చంద్రాకారంలో ఉండే ఈ మ్యూజియంలో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతిగాంచిన వీల్డ్ రెబ‌కా విగ్ర‌హం ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంటుంది. మ్యూజియంలో ఉన్న ఆయుధాల సేక‌ర‌ణ‌లో రాణీ నూర్జ‌హాన్‌, షాజ‌హాన్ చ‌క్ర‌వ‌ర్తి, ఔరంగ‌జేబ్ వినియోగించిన‌ బాకులు, క‌త్తులు ఉన్నాయి. మ్యూజియాల‌పై ఆస‌క్తి ఉన్న‌వారికి సాలార్జంగ్ మ్యూజియం రాయ‌ల్ ట్రీట్ ఇస్తుందన‌డం వాస్త‌వం.

4. ఇండో-పోర్చ్‌గీస్ మ్యూజియం, ఫోర్ట్ కొచ్ఛిః
కేర‌ళ‌లోని ఫోర్ట్ కొచ్ఛి న‌గ‌రంలో ఈ ఇండో-పోర్చ్‌గీస్ మ్యూజియం ఉంది. ఆ ప్రాంతంపైన చారిత్ర‌కంగా, సాంస్కృతికంగా పోర్చుగ‌ల్ ప్ర‌భావం ఎలా ఉండేదో ఈ మ్యూజియంలో చూడొచ్చు. ఈ మ్యూజియం ఐదు ప్ర‌ధాన భాగాలుగా విభ‌జించ‌బ‌డింది. అవి, ఆల్ట‌ర్ (బ‌లిపీఠం), ట్రెజ‌ర్ (నిథి), ప్రోసెష‌న్ (ఊరేగింపు), సివిల్ లైఫ్ (పౌర జీవితం), కెథ‌డ్ర‌ల్ (ప్ర‌ధాన దేవాలయం). ఈ మ్యూజియంలో ఉన్న ఎక్కువ క‌ళాఖండాలు పోర్చుగీసు పాల‌న‌లో నిర్మించిన చ‌ర్చీల నుంచి తిరిగి తీసుకొచ్చిన‌వే. ఇందులోని వైభ‌వం, సంప‌న్నత ఉట్టిప‌డే ఆర్టిక‌ల్స్ చూస్తే క‌ళ్లార్ప‌లేరు... ఈ మ్యూజియంని త‌ప్ప‌నిస‌రిగా చూడాల్సిందే.

5. బిహార్ మ్యూజియం, పాట్నాః
భార‌త‌దేశ చ‌రిత్ర‌ (Indian History)లో బిహార్‌కు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. ఈ ప్రాంతం ప్రాచీన భార‌త‌దేశాన్ని ఏకం చేసిన ఉత్ప్రేర‌క శ‌క్తిగా ప‌నిచేసింది. ఈ ప్రాంత‌పు గొప్ప చ‌రిత్ర‌ను ప్ర‌ద‌ర్శించ‌డంపైన‌, సెల‌బ్రేట్ చేయ‌డం పైన బిహార్ మ్యూజియం (Bihar Museum) ప్ర‌ధాన దృష్టిని సారించింద‌ని తెలుస్తుంది. 1917 స్థాపించిన పాట్నా మ్యూజియం నుంచి బిహార్ మ్యూజియం పుట్టింది. బిహార్ మ్యూజియంలో చ‌రిత్ర‌కు పూర్వం ఉన్న వ‌స్తువులు, ఆంథ్రోపొలాజిక‌ల్ క‌ళాఖండాలు, సామాజిక చ‌రిత్ర వ‌స్తువులు, క‌ళా వ‌స్తువులు ఉంటాయి. వీటిలో థంగ్కాక్స్ (టిబేటియ‌న్ బౌద్ధ కాట‌న్ వ‌స్త్రాల‌పై చిత్ర‌లేఖ‌నాలు), మీనియేచ‌ర్ చిత్రాలు, రాతి, కాంస్య శిల్పాలు కూడా ఉన్నాయి. ఇక్క‌డ సేక‌రించి, ఉంచిన వ‌స్తువుల ద్వారా పురాత‌న‌ పాట‌లీపుత్రం, బిహార్ చ‌రిత్ర‌ను ప్రారంభ కాలం నుంచి 18వ శ‌తాబ్థం వ‌ర‌కూ తెలుసుకోవ‌చ్చు.

Keywords:
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Hyderabad, Lockdown, Museum, New Delhi

తదుపరి వార్తలు