హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Farm Laws: కొత్త వ్యవసాయ చట్టాలపై ఐఎంఎఫ్ ప్రశంసలు.. అదే సమయంలో..

Farm Laws: కొత్త వ్యవసాయ చట్టాలపై ఐఎంఎఫ్ ప్రశంసలు.. అదే సమయంలో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Farm Laws: భారత దేశ వ్యవసాయ రంగంలో పెను మార్పులకు మూడు కొత్త వ్యవసాయ చట్టాలు కీలకమైన ముందడుగు అని ఐఎంఎఫ్ వ్యాఖ్యానించింది.

భారత ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఐఎంఎఫ్(అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కొత్త చట్టాలు గ్రామీణ అభివృద్ధికి దోహదం చేస్తాయని అభిప్రాయపడింది. రైతులు నేరుగా కొనుగోలుదారులతో ఒప్పందాలు చేసుకునే వీలు ఈ కొత్త చట్టం ద్వారా కలుగుతుందని పేర్కొంది. దీనివల్ల రైతుల సామర్థ్యం మరింత పెరిగనుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అభిప్రాయపడింది. భారత దేశ వ్యవసాయ రంగంలో పెను మార్పులకు మూడు కొత్త వ్యవసాయ చట్టాలు కీలకమైన ముందడుగు అని వ్యాఖ్యానించింది.

ఇదే సందర్భంలో ప్రభుత్వానికి ఐఎంఎఫ్ పలు సూచనలు కూడా చేసింది. వ్యవసాయ రంగంలో జరగనున్న ఈ మార్పుల వల్ల ప్రభావం చూపే వారికి సరైన రీతిలో నష్టపరిహారం కల్లించాల్సి ఉందని వెల్లడించింది. ఈ చట్టాల ద్వారా నష్టపోయే ఆయా వర్గాలకు ప్రత్యామ్నాయ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి ఉందని అభిప్రాయపడింది. కొత్త వ్యవస్థకు మారే క్రమంలో సామాజిక భద్రత కూడా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. తొమ్మిదో విడత రైతులు-ప్రభుత్వం మధ్య చర్చలు జరుగుతున్న తరుణంలో ఐఎంఎఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు ఈ చట్టాలపై గత కొన్ని వారాలుగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రంతో పలుసార్లు చర్చలు జరిపినప్పటికీ.. రైతు సంఘాలు మాత్రం ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలనే అంశంపై వెనక్కి తగ్గడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి చట్టాల అమలుపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వం, రైతు సంఘాలతో నలుగురు సభ్యులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిటీతో తాము చర్చలు జరపబోమని రైతు సంఘాలు మరోసారి స్పష్టం చేశాయి. తాజాగా నేడు తొమ్మిదోసారి ప్రభుత్వంతో రైతు సంఘాలు చర్చలు జరుపుతున్న నేపథ్యంలో.. ఈ రోజు జరగనున్న చర్చల్లో ఏమైనా పురోగతి ఉంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

First published:

Tags: Farmers Protest, Imf

ఉత్తమ కథలు