హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

International Flights : విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..మార్చి నుంచి కోవిడ్ పూర్వ స్థితి

International Flights : విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..మార్చి నుంచి కోవిడ్ పూర్వ స్థితి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

International Flights Restart : కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన రెగ్యులర్‌ అంతర్జాతీయ విమాన సేవలను తిరిగి ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది.  కొవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా

International Flights Restart : కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన రెగ్యులర్‌ అంతర్జాతీయ విమాన సేవలను తిరిగి ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది.  కొవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా అంతర్జాతీయ విమాన సేవలపై ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మార్చి 23, 2020 నుండి అమలులో ఉన్న షెడ్యూల్ అంతర్జాతీయ ప్రయాణికుల విమానాల సస్పెన్షన్ ప్రస్తుతం ఫిబ్రవరి 28 వరకు అమలులో ఉంది. ఈ నేపథ్యంలో మార్చి- ఏప్రిల్‌ నెలల్లో రెగ్యులర్‌ అంతర్జాతీయ విమానాలు ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది.

వాస్తవానికి డిసెంబర్‌ 15న అంతర్జాతీయ విమానాలను ప్రారంభించాలని కేంద్రం తొలుత భావించింది. ఒమిక్రాన్‌ కేసుల పెరగడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. అయితే ఇప్పుడు కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం, వివిధ దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మార్చి- ఏప్రిల్‌ నెలల్లో రెగ్యులర్‌ అంతర్జాతీయ విమానాలు ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది.

ALSO READ Tesla CEO : పేదల ఆకలి తీర్చేందుకు..రూ45 వేల కోట్లు విరాళమిచ్చిన ఎలాన్ మస్క్

ఈ విషయమై పౌర విమానయాన శాఖ.. కేంద్ర హోంశాఖ, కేంద్ర ఆరోగ్యశాఖలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే జూలై 2020లో అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, సింగపూర్‌, యూఏఈ ఇలా.. సుమారు 28 దేశాలతో భారత్‌ ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఆయా దేశాలకు ప్రత్యేక విమానాలను నడుపుతున్నారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Air India, Flight, Passengers

ఉత్తమ కథలు