హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Uterus Transplant: గుజరాత్‌లో తొలిసారిగా గర్భాశయ మార్పిడి సర్జరీ.. తల్లుల నుంచి గర్భసంచి పొందిన ఇద్దరు మహిళలు

Uterus Transplant: గుజరాత్‌లో తొలిసారిగా గర్భాశయ మార్పిడి సర్జరీ.. తల్లుల నుంచి గర్భసంచి పొందిన ఇద్దరు మహిళలు

Uterus Transplant: గుజరాత్‌లో తొలిసారిగా గర్భాశయ మార్పిడి సర్జరీ.. తల్లుల నుంచి గర్భసంచి పొందిన ఇద్దరు మహిళలు

Uterus Transplant: గుజరాత్‌లో తొలిసారిగా గర్భాశయ మార్పిడి సర్జరీ.. తల్లుల నుంచి గర్భసంచి పొందిన ఇద్దరు మహిళలు

Uterus Transplant: గుజరాత్‌లో ఇద్దరు మహిళలకు ఏకంగా గర్భాశయ మార్పిడి సర్జరీ చేసి రికార్డు సృష్టించారు వైద్యులు. గుజరాత్‌ చరిత్రలో గర్భాశయ మార్పిడి సర్జరీ విజయవంతంగా జరగడం ఇదే తొలిసారి. అలాగే ప్రభుత్వాసుపత్రిలో గర్భాశయ మార్పిడి జరగడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

వైద్య రంగంలో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ (Technology)తో ఎన్నో రకాల అసాధ్యాలు సుసాధ్యం అవుతున్నాయి. ఒకప్పుడు వ్యక్తుల కిడ్నీలు (Kidneys) మాత్రమే మార్పిడి చేయగలిగిన వైద్య నిపుణులు, ఇప్పుడు ఎన్నో రకాల ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలను విజయవంతంగా పూర్తిచేస్తున్నారు. తాజాగా గుజరాత్‌ (Gujarat)లో ఇద్దరు మహిళలకు ఏకంగా గర్భాశయ మార్పిడి సర్జరీ చేసి రికార్డు సృష్టించారు వైద్యులు. గుజరాత్‌ చరిత్రలో గర్భాశయ మార్పిడి సర్జరీ విజయవంతంగా జరగడం ఇదే తొలిసారి. అలాగే ప్రభుత్వాసుపత్రిలో గర్భాశయ మార్పిడి జరగడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. ప్రస్తుతం ఈ రకమైన చికిత్సలు మాతృత్వం కోసం ఆకాంక్షించే మహిళలకు ఒక వరంలా మారుతున్నాయి.

అహ్మదాబాద్‌కు చెందిన ఒక మహిళ, కేశోద్‌కు చెందిన మరో మహిళ అహ్మదాబాద్‌లోని సివిల్ హాస్పిటల్ క్యాంపస్‌లోని కిడ్నీ ఆసుపత్రిలో గర్భాశయ మార్పిడి చేయించుకున్నారు. ప్రతి 5000 వేల మంది మహిళల్లో ఒకరికి.. పుట్టినప్పటి నుంచి గర్భాశయ తిత్తి (uterine cyst) ఉండదు. దీంతో వీరు పిల్లలను కనలేరు. ఇలాంటి సమస్య ఉన్న ఇద్దరు మహిళలు తాజాగా వారి తల్లుల నుంచి గర్భాశయ మార్పిడి చేయించుకున్నారు. ఈ సర్జరీ కోసం పూణే నుంచి 10 మంది వైద్యుల బృందం అహ్మదాబాద్‌కు వచ్చింది.

* ప్రత్యేక వైద్య బృందం

ఈ విషయంపై అహ్మదాబాద్ క్యాంపస్ కిడ్నీ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ వినీత్ మిశ్రా మాట్లాడారు. గర్భాశయ మార్పిడి ప్రక్రియకు 12 గంటల సమయం పడుతుందని, అయితే డాక్టర్ శైలేష్ పుతాంబాకర్ నేతృత్వంలోని వైద్యుల బృందం 10 నుంచి 12 గంటల్లో రెండు ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు పూర్తి చేశారని తెలిపారు. ఈ విజయవంతమైన పిండ మార్పిడి (embryo transplant) సర్జతో ఇద్దరు స్త్రీలు మాతృత్వం పొందే అవకాశం కలిగిందన్నారు. తల్లుల నుంచి గర్బాశయాన్ని స్వీకరించిన ఇద్దరు స్త్రీలు ఇప్పుడు గర్భం దాల్చగలుగుతారని వెల్లడించారు.

గుజరాత్‌లో ఒకే రోజు రెండు గర్భాశయ మార్పిడి సర్జరీలు చేసి రికార్డు సృష్టించామని తెలిపారు పూణేకు చెందిన డాక్టర్ శైలేష్. 2017లో మహారాష్ట్రలోని పూణేలో తమ బృందం మొదటిసారి గర్భాశయ మార్పిడి మార్పిడిని చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో తప్ప దేశంలో ఎక్కడా జరగని ఈ సర్జరీని ఇప్పుడు గుజరాత్‌లో చేసినట్లు పేర్కొన్నారు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ మొత్తం ఆపరేషన్‌ను టెలిస్కోప్‌ ద్వారా చేశారు. గర్భాశయాలు పొందిన మహిళలు, గర్భాలను దానం చేసిన దాత తల్లులు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని, ఇప్పుడు ఏడు నెలల తర్వాత ఇద్దరు స్త్రీలు గర్భం దాల్చగలుగుతారని శైలేష్ వెల్లడించారు. గత 2 సంవత్సరాలుగా గుజరాత్‌లోని కిడ్నీ ఆసుపత్రిలో గర్భాశయ మార్పిడి ఆపరేషన్ల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాతృత్వం కోసం తహతహలాడుతున్న మహిళలకు ఈ సర్జరీలు వరం కానున్నాయి.

(Sanjay Tank, Ahmedabad)

Published by:Sridhar Reddy
First published:

Tags: Ahmedabad, Doctors, Gujarat, VIRAL NEWS

ఉత్తమ కథలు