Anant Ambani-Radhika Merchant Engagement : రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ- నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani)కి గురువారం వీరేన్ మర్చంట్- శైలా మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్(Radhika Merchant)తో నిశ్చితార్థం(Engagement) జరిగింది. రాజస్తాన్(Rajastan) లోని నథ్ ద్వారాలోని శ్రీనాథ్ జీ ఆలయంలో కుటుం సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. పెళ్లి తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే త్వరలో ముకేష్ అంబానీ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టబోతున్న రాధికా మర్చంట్ ఎవరు అన్న చర్చ మొదలైంది. రాధికా మర్చంట్ అనంత్ అంబానీకి చిన్ననాటి స్నేహితురాలు. దేశంలోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సీఈఓ అయిన బిలియనీర్ పారిశ్రామికవేత్త విరెన్ మర్చంట్-శైలా మర్చంట్ దంపతుల మొదటి కుమార్తె రాధికా మర్చంట్. రాధిక చెల్లెలు పేరు అంజలి మర్చంట్. రాధిక కుటుంబం గుజరాత్‌లోని కచ్‌కు చెందినది. 1994 డిసెంబర్ 18న జన్మించిన రాధికాకు శాస్త్రీయ నృత్యం అంటే చాలా ఇష్టం, ఎనిమిదేళ్లుగా భరతనాట్యంలో శిక్షణ తీసుకుంటున్నారు. ముంబైలోని శ్రీ నిభా ఆర్ట్ అకాడమీలో గురు భావ ఠక్కర్ ఆధ్వర్యంలో ఆమె శాస్త్రీయ నృత్య శిక్షణ తీసుకుంటున్నారు. ఈ సంవత్సరం మేలో ముఖేష్ అంబానీ - నీతా అంబానీ తమ కాబోయే చిన్న కోడలు రాధికా మర్చంట్ కోసం అరంగేట్రం వేడుకలు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.
అయితే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..ముకేష్ అంబానీ కూతురు ఇషా అంబానీకి 2018లో ఆనంద్ పిరమల్‌తో జరిగిన వివాహంలో రాధికా మర్చంట్ కీలక పాత్ర పోషించింది, వధువు సంగీత వేడుకలో ఇషా, శ్లోకా మెహతాతో కలిసి ప్రదర్శన ఇచ్చింది. ప్రైవేట్ అంబానీ కుటుంబ ఈవెంట్‌ల నుండి లీక్ అయిన చిత్రాలు కూడా రాధికా మర్చంట్ తన అత్తమామలతో తిరుగుతున్నట్లు చూపుతున్నాయి. చాలా ఏళ్లుగా అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఫంక్షన్‌లో రాధిక కనిపిస్తూనే ఉంది. అయితే రాధికా మర్చంట్-అనంత్ అంబానీ డేటింగ్‌కు ముందు చాలా కాలం స్నేహితులుగా ఉన్నారని ఇండియా టుడే నివేదించింది. 2018లోఒకరి కళ్లలోకి మరొకరు తదేకంగా చూస్తున్న వారి ఫొటో లీక్ అయిన తర్వాత వారు ప్రేమలో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది అని తెలిపింది.
Srinathji Temple: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్థం జరిగిన శ్రీనాథ్‌జీ ఆలయ చరిత్ర ఇదే..
మరోవైపు,అంబానీ కుటుంబానికి భిన్నంగా రాధికా మర్చంట్ తను స్వంతగా కాఫీని కొనుగోలు చేయడం, బహిరంగ ప్రదేశాల్లో భోజనం చేయడం వంటి సాధారణ పనులు చేస్తూ తరచుగా కనిపిస్తారు. ఆమె అభిమానులు తరచుగా ఆమె విహారయాత్రల చిత్రాలను సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేస్తుంటారు. మేకప్ లేకుండా, సాధారణ జీన్స్- టీ-షర్టులు ధరించి చాలా సింపుల్ గా జీవించే ఆమెపై ప్రశంసలు కురిపిస్తుంటారు నెటిజన్లు. అంతేకాకుండా ఆమె ప్రకాశవంతమైన రూపానికి కూడా ప్రశంసలు అందుకుంది. రాధిక తన స్కూలింగ్ ముంబైలోని ఎకోల్ మోండియాల్ వరల్డ్ స్కూల్, BD సోమని ఇంటర్నేషనల్ స్కూల్ లో పూర్తి చేసింది. 2017లో న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో పట్టభద్రురాలయ్యారు. చదువు పూర్తి చేసిన తర్వాతఆమె భారతదేశానికి వచ్చి, ఇండియా ఫస్ట్ ఆర్గనైజేషన్, దేశాయ్ & దేవాన్జీ వంటి సంస్థలలో ఇంటర్న్‌షిప్ చేసింది. ఆమె ట్రెక్కింగ్‌ను ఇష్టపడుతుంది సమచారం. కాబట్టి ఆమె తన స్వదేశం నుండి దూరంగా వెళ్లనప్పటికీ, ఆమె బహుశా హాలిడే ట్రిప్‌లను ఇష్టపడుతుంది. 2020లో ఆమె పుట్టినరోజు వేడుకలో ముఖేష్ అంబానీ రాధికాకి కేక్ తినిపించిన వీడియో వైరల్ అయింది. ఆమె అంబానీ కుటుంబంతో కలిసి వారి విలాసవంతమైన ఆకాశహర్మ్య గృహం యాంటిలియాలో కేక్ కట్ చేసింది. కాగా,రాధికా తండ్రి విరేన్ ముఖేష్‌తో మంచి స్నేహితుడని అంబానీ కుటుంబ కార్యక్రమాలలో క్రమం తప్పకుండా కనిపిస్తాడని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.