అలా సెక్స్ చేస్తే మగ పిల్లాడు పుడతాడు... ఇందూరికర్ మహరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Maharashtra | Indurikar Maharaj : ఈ దేశంలో నోటికొచ్చినట్లు మాట్లాడే వాళ్లు చాలా మంది ఉన్నారు. సమాజంలో కాస్త పలుకుబడి ఉన్నవారు కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడేస్తుండటం ఇబ్బంది కలిగించే అంశం. మరి ఇందూరికర్ మహరాజ్ ఏం మాట్లాడారో చూద్దాం.


Updated: February 13, 2020, 10:25 AM IST
అలా సెక్స్ చేస్తే మగ పిల్లాడు పుడతాడు... ఇందూరికర్ మహరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
అలా సెక్స్ చేస్తే మగ పిల్లాడు పుడతాడు... ఇందూరికర్ మహరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు (credit - twitter - Suhas Mane)
  • Share this:
Maharashtra | Indurikar Maharaj : పుట్టబోయేది అమ్మాయా, అబ్బాయా అన్నది డాక్టర్లు ముందే చెప్పకూడదన్నది మన చట్టం. పాప పుడితే చంపేస్తున్నారన్న ఉద్దేశంతో చట్టాన్ని అలా రూపొందించారు. ఇలాంటి అంశాల్లో సెన్సిటివిటీ గుర్తించి... అందుకు అనుగుణంగా నడుచుకుంటున్నారు అందరూ. ఐతే... ప్రముఖ మరాఠా బోధకుడు (Preacher) ఇందూరికర్ మహరాజ్ మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే... సరి సంఖ్య (Even) ఉన్న రోజును సెక్స్, డేటింగ్ చేస్తే... మగ పిల్లాడు పుడతాడనీ, అదే బేసి సంఖ్య (Odd) ఉన్న రోజున సెక్స్ లేదా డేటింగ్ చేస్తే ఆడ పిల్ల పుడుతుందని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు చేశాక వివాదాస్పదం కాకుండా ఉంటాయా? ఈయనేంటి... ఇలా మాట్లాడుతున్నాడు అని అంతా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆయన్ని అందరూ తిట్టిపోస్తున్నారు.

అహ్మద్‌నగర్ జిల్లాలో చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. సోషల్ మీడియాలో దీనిపై ఒకటే చర్చ. అందరికీ తెలుసు. ఇవో పనికిమాలిన కామెంట్లని. అయినప్పటికీ... ఆయన అలా ఎందుకన్నారో అని కొందరు... అందులో నిజం ఉందేమో అని మరికొందరు... ఏమీ లేకపోతే అలా ఎందుకంటారని ఇంకొందరు, అలా ఎలా మాట్లాడతారని మరికొందరు, దుర్మార్గుడు అని తిట్టిపోస్తూ ఇంకొందరూ... ఇలా ఎవరి అభిప్రాయం వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

ఇందూరికర్ మహరాజ్ మరో డైలాగ్ కూడా అన్నారు. మంచి సమయంలో సెక్స్ చేస్తే.... మంచి బిడ్డ పుడతారనీ అదే చెడు సమయంలో సెక్స్ చేస్తే... పుట్టే బిడ్డ ఆ కుటుంబానికి చెడ్డపేరు తెస్తారని కూడా అన్నారు. ఇదివరకు కూడా ఇందూరికర్ మహరాజ్ ఇలాంటి చాలా వింత కామెంట్లు చేశారు. వాటి సంగతెలా ఉన్నా... తాజా కామెంట్లపై మాత్రం మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్పందించారు. ఈ వ్యాఖ్యలు ప్రీ-కన్సెప్షన్ అండ్ ప్రి-నాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (PCPNDT) యాక్ట్‌కి వ్యతిరేకంగా ఉన్నాయన్న అధికారులు... తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఏది ఏమైనా సమాజంలో పెద్ద మనుషుల్లా చెలామణీ అవుతున్నవారు... తమ పెద్దరికాన్ని నిలబెట్టుకోకుండా... ఇలా సమాజాన్ని తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చెయ్యడం దారుణం అంటున్నారు ప్రజలు.

First published: February 13, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు