హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

PM Modi ప్రాణాలకు ముప్పు.. Republic Day రోజున ఉగ్రకుట్ర.. ఐదు అతిథి దేశాల అధినేతలకూ..

PM Modi ప్రాణాలకు ముప్పు.. Republic Day రోజున ఉగ్రకుట్ర.. ఐదు అతిథి దేశాల అధినేతలకూ..

ణతంత్ర దినోత్సవం (Republic Day) రోజున ప్రధాని మోదీ, ఆ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేయనున్న ఐదు దేశాల అధినేతల ప్రాణాలకు ముప్పు కలిగించే ఉగ్రకుట్రను నిఘా ఏజెన్సీలు గుర్తించాయి. రిపబ్లిక్ డే నాడు ప్రధాని మోదీ, విదేశీ గెస్టులకు ముప్పు ఉందని నిఘా వర్గాలు అలర్ట్ జారీ చేశాయి.

ఇంకా చదవండి ...

  భారత ప్రధాని నరేంద్ర మోదీ భద్రతకు సంబంధించి మరో కీలక అలర్ట్ జారీ అయింది. గణతంత్ర దినోత్సవం (Republic Day) రోజున ప్రధాని మోదీ, ఆ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేయనున్న ఐదు దేశాల అధినేతల ప్రాణాలకు ముప్పు కలిగించే ఉగ్రకుట్రను నిఘా ఏజెన్సీలు గుర్తించాయి. రిపబ్లిక్ డే నాడు ప్రధాని మోదీ, విదేశీ గెస్టులకు ముప్పు ఉందని నిఘా వర్గాలు అలర్ట్ జారీ చేసిన విషయాన్ని ఇండియా టుడే రిపోర్ట్ చేసింది. నిఘా వర్గాలలు పొందుపర్చిన తొమ్మిది పేజీల రిపోర్టు కూడా తమ దగ్గరుందని ఆ మీడియా సంస్థ పేర్కొంది. పంజాబ్ లో ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం ఘటన, దానిపై విచారణ చేస్తోన్న జడ్జి, లాయర్లకు అనుమానిత ఖలిస్తానీ తీవ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో తాజా సెక్యూరిటీ అలర్ట్ కీలకంగా మారింది.

  ఈనెల 23 నుంచి భారత గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 26న రాజ్ పథ్ లో జరిగే ప్రధాన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈసారి గణతంత్ర వేడుకలకు ఇండియా పొరుగున ఉన్న ఐదు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవానికి భారత్.. కజకిస్థాన్, కిర్గిజిస్థాన్, తజకిస్థాన్, తుర్క్మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల అధినేతలను అతిథులుగా ఆహ్వానించడం తెలిసిందే. మోదీ సహా ముఖ్యనేతల ప్రాణాలకు ముప్పు కలిగించేలా ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ అలర్ట్ జారీ చేశాయని మీడియా రిపోర్టులో వెల్లడైంది.

  Covid చికిత్సలో కేంద్రం సంచలనం: మళ్లీ రెమ్‌డెసివీర్‌కు చోటు.. తీవ్రతను బట్టి వాడాల్సిన మందులివే

  పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ ప్రాంతాలకు చెందిన టెర్రర్ గ్రూపుల నించే నేతలకు ముప్పుందని రిపోర్టులో రాసుందని, ఉన్నత స్థానంలో ఉన్న ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని, బహిరంగ సభలు, కీలకమైన సంస్థలు, రద్దీగా ఉండే ప్రదేశాలను విధ్వంసం చేసేలా ఉగ్ర సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయని రిపోర్టులో రాసున్నట్లు ఇండియా టుడే పేర్కొంది.

  Aahana Kumra: అగ్గిరాజేసిన ఆహానా కుమ్రా.. బిగుతైన బికినీలో అందాల విందు.. ఆహా అనాల్సిందే!

  ప్రధాని మోదీ, ఇతర ఆసియా దేశాల అధినేతలకు ముప్పు కలిగించే అవకాశమున్న ఉగ్ర సంస్థల్లో లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్ ఫోర్స్, జైషే మహ్మద్, హర్కత్ ఉల్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి గ్రూపులున్నట్లు రిపోర్టులో రాసుందని మీడియా సంస్థ తెలిపింది. మరోవైపు ఖలిస్థానీ గ్రూపు మిలిటెంట్లు కూడా ఉగ్ర దాడులకు ప్రణాళికలు వేస్తున్నారని, పంజాబ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ లక్షిత దాడులకు ప్లాన్‌ చేస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నట్లు వెల్లడైంది. కాగా, ప్రధాని ప్రణాలకు ముప్పుందంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ జారీ చేయడం సాధారణ ప్రక్రియలో భాగంగా జరిగేదేనా, అసాధారణమైందా? అనే విషయం తేలాల్సి ఉంది.

  PRC Issue : ఏపీ ఉద్యోగులకు భారీ షాకిచ్చిన CM Jagan -పీఆర్సీపై రాత్రికిరాత్రే 3జీవోలు.. ఏముందంటే  ఇక, పంజాబ్ లో ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన విచారణ కమిటీ చీఫ్ మాజీ జడ్జి జస్టిస్ ఇందూ మల్హోత్రాకు ఖలిస్తానీ గ్రూపుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై పిటిషన్లు వేసిన మరో ఇద్దరు లాయర్లకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి.

  First published:

  Tags: Delhi, Pm modi, Republic Day 2021, Security

  ఉత్తమ కథలు