ఢిల్లీని టార్గెట్ చేసిన ఉగ్రవాదులు.. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక

ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే ఢిల్లీలోని గెస్ట్ హౌస్‌లు, హోటళ్లకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. జమ్మూకాశ్మీర్ రిజిస్ట్రేషన్ పేరుతో కార్లు కనిపిస్తే `తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు

news18-telugu
Updated: June 21, 2020, 10:35 PM IST
ఢిల్లీని టార్గెట్ చేసిన ఉగ్రవాదులు.. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
యావత్ భారత్ దేశం కరోనా కష్టాల్లో ఉంది. అన్ని ప్రభుత్వాలు కరోనా కట్టడి చర్యల్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఉగ్రవాదులు కుట్రలు చేస్తున్నారు. ఢిల్లీలో భారీ విధ్వంసానికి స్కెచ్ వేసినట్లు ఇంటెలిజన్స్ వర్గాలు గుర్తించాయి. ఐదుగురు టెర్రరిస్టులు కశ్మీర్ నుంచి ట్రక్కులో బయలుదేరి వచ్చారని.. ఇప్పటికే ఢిల్లీ చేరుకొని ఉంటారని వెల్లడించాయి. ఈ మేరకు ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశాయి. వారు రోడ్డు మార్గం ద్వారానే నగరంలోకి చొరబడి ఉంటారని.. తనిఖీలను ముమ్మరం చేయాలని సూచించాయి. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే ఢిల్లీలోని గెస్ట్ హౌస్‌లు, హోటళ్లకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. జమ్మూకాశ్మీర్ రిజిస్ట్రేషన్ పేరుతో కార్లు కనిపిస్తే `తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అన్ని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లనూ అప్రమత్తంచేశారు. ఎలాంటి అనుమానస్పద కదలికలు కనిపించినా పోలీసులకు చెప్పాలని లౌడ్ స్పీకర్ల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.
First published: June 21, 2020, 10:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading