జైషే మహమ్మద్ దాడులకు తెగబడే అవకాశం.. ఇంటలిజెన్స్ హెచ్చరికలు..

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించినప్పటి నుంచి జైషే మహమ్మద్ ఉగ్రదాడులకు స్కెచ్ వేస్తూనే ఉంది. తాజాగా అయోధ్య తీర్పు కూడా రావడంతో ఉగ్ర దాడులకు పాల్పడేందుకు జైషే మహమ్మద్ మళ్లీ కుట్రలకు తెరలేపింది.

news18-telugu
Updated: November 10, 2019, 5:07 PM IST
జైషే మహమ్మద్ దాడులకు తెగబడే అవకాశం.. ఇంటలిజెన్స్ హెచ్చరికలు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: November 10, 2019, 5:07 PM IST
సుప్రీం కోర్టు అయోధ్య తీర్పు నేపథ్యంలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఇంటలిజెన్స్ బ్యూరో(ఐబీ), రీసెర్చ్&అనాలసిస్ వింగ్(రా) నుంచి అందిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. జైషే మహమ్మద్ భారీ దాడులకు పాల్పడే అవకాశం ఉందని.. ఏ సమయంలోనైనా దాడులు జరగవచ్చునని ఇంటలిజెన్స్ అధికారులు తెలిపారు. అయోధ్య తీర్పుకు వెలువడబోతుందన్న ప్రచారం మొదలైనప్పటినుంచే జైషే మహమ్మద్ వర్గాలు దాడులకు ప్లాన్ చేసుకుంటున్నట్టు తమ వద్ద సమాచారం ఉందని ఇంటలిజెన్స్ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే భద్రతా దళాలకు సమాచారం అందజేసినట్టు చెప్పారు. జైషే మహమ్మద్ టార్గెట్ చేసిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్,హిమాచల్ ప్రదేశ్‌లు ఉన్నట్టు తెలిపారు.

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించినప్పటి నుంచి జైషే మహమ్మద్ ఉగ్రదాడులకు స్కెచ్ వేస్తూనే ఉంది. తాజాగా అయోధ్య తీర్పు
కూడా రావడంతో ఉగ్ర దాడులకు పాల్పడేందుకు జైషే మహమ్మద్ మళ్లీ కుట్రలకు తెరలేపింది. ఇంటలిజెన్స్ హెచ్చరికలతో అన్ని రాష్ట్రాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.

First published: November 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...