రాజధానిలో నలుగురు జైషే ఉగ్రవాదులు.. అలర్ట్ ప్రకటించిన పోలీసులు..

దేశ రాజధాని ఢిల్లీలోకి నలుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు చొరబడ్డట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. దసరాను పురస్కరించుకొని భారీ విధ్వంసానికి కుట్ర పన్నే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించాయి.

news18-telugu
Updated: October 3, 2019, 1:45 PM IST
రాజధానిలో నలుగురు జైషే ఉగ్రవాదులు.. అలర్ట్ ప్రకటించిన పోలీసులు..
ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు
  • Share this:
జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో పాక్ ఉగ్రవాదులు ఎప్పుడెప్పుడు భారత్‌పై దాడి చేద్దామా? అని కాచుకొని కూర్చున్నాయి. సరిహద్దులో గుడారాలు వేసుకొని దేశంలోకి చొరబడే సమయం కోసం వేచి చూస్తున్నారని ఆర్మీ సహా అమెరికా కూడా హెచ్చరించింది. అయితే, తాజాగా.. దేశ రాజధాని ఢిల్లీలోకి నలుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు చొరబడ్డట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. దసరాను పురస్కరించుకొని భారీ విధ్వంసానికి కుట్ర పన్నే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించాయి. దీంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తూ అనుమానం ఉన్నవారిని అరెస్టు చేస్తున్నారు. పెట్రోలింగ్, పికెటింగ్ నిర్వహిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్త పడుతున్నారు.

కాగా, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌ల్లోనూ భద్రతను మరింత పెంచారు. అమృత్ సర్, పటాన్‌కోట్, శ్రీనగర్‌లో ఉన్న ఎయిర్ బేస్‌ల భద్రతను కట్టుదిట్టం చేశారు. దాదాపు 8 నుంచి 10 మంది ఉగ్రవాదులు ఎయిర్ బేస్‌లలో ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అటు.. శ్రీనగర్, జమ్మూ, అవంతిపూర్, పటాన్‌కోట్, హిందాన్ ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించారు.

First published: October 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>