Insurance fraud : జీవిత బీమా కోసం మతిస్థిమితం లేని వాడిని చంపాడు.. అమెరికా కంపనీ విచారణలో అసలు నిజాలు..

Insurance fraud : జీవిత బీమా కోసం మతిస్థిమితం లేని వాడిని చంపాడు..

Insurance fraud : అమెరికాలో ఉంటున్న ఓ వ్యక్తి అక్కడే కోట్ల రుపాయాల లైఫ్ ఇన్స్యూరెన్స్ చేయించాడు.. ఆ డబ్బు కోసం కక్కుర్తి పడ్డాడు.. దాని కోసం ఇండియాకు వచ్చి స్కెచ్ వేశాడు. ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ కోసం మరో వ్యక్తిని చంపి తన పేరు మీద డెత్ సర్టిఫికెట్ సంపాదించాడు.

 • Share this:
  ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం వక్రమార్గాలు పట్టిన అనేక మంది కటకటాల పాలయిన వారు ఉన్నారు. బ్రతికున్నవారినే చనిపోయినట్టు సృష్టించి.. చివరకు పోలీసులకు పట్టుబడిన వారు కోకొల్లలు.. అయితే ఇలాంటి సంఘటనలు ఇండియాలోనే కాదు.. అమెరికాలో కూడా చోటు చేసుకున్నాయి. ఇండియాకు చేందిన ఓ వ్యక్తి ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం మరో మతి స్థిమితం లేని వ్యక్తిని హత్య చేశారు.. తాను చనిపోయినట్టు కొడుకు ద్వారా అమెరికాలో క్లెయిమ్ చేయించారు. అయితే గతంలోనే ఓ సారి ఇలా తాను చనిపోయానట్టు మోసం చేసిన వ్యక్తి కావడంతో ఆ అమెరికన్ కంపనీ క్షుణ్ణంగా పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది.

  ఈ ఘటన మహారాష్ట్రలోని (Ahmednagar district ) అకోల్ తహసీల్ పరిధిలోని రాజూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రభాకర్ వాఘ్‌చౌరే అనే వ్యక్తి గత 20 ఏళ్లుగా అమెరికాలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతడు అమెరికాలోని ఓ సంస్థ నుంచి 5 మిలియన్ డాలర్ల(రూ. 37.5 కోట్లు) విలువైన బీమా తీసుకున్నాడు. అయితే ప్రభాకర్ 2021లో జనవరిలో ఇండియాకు వచ్చాడు. అహ్మద్‌నగర్ జిల్లాలోని దామన్ గావ్ అనే గ్రామంలో తన అత్తమామల వద్ద నివసించేవాడు.

  ఇది చదవండి : ఇష్టం లేదని చెప్పినా వినకుండా.. చెల్లెలినే ఆ రొంపిలోకి దింపారు.. మాట వినలేదని చివరికి...?


  అయితే ఇన్సురెన్స్ డబ్బులు దక్కించుకోవడానికి తప్పుడు పత్రాలు సృష్టించాలని ప్రభాకర్ భావించాడు. ఇందుకోసం పెద్ద స్కెచ్ వేశాడు. తాను చనిపోయినట్టుగా సృష్టించి డబ్బులు కాజేయాలని నిర్ణయించాడు.తన ఈ క్రమంలోనే మానసిక స్థితి బాగోలేని ఓ వ్యక్తిని చంపడానికి ప్లాన్ వేశాడు. ఇందుకోసం స్థానికంగా ఉండే.. సందీప్ తలేకర్, హర్షద్ లహమగే, హరీష్ కులా్, ప్రశాంత్ చౌదరిల సాయం తీసుకున్నాడు. వారికి డబ్బులు ఇస్తానని మాట ఇచ్చాడు. తర్వాత ప్రభాకర్ రాజూర్ గ్రామానికి మకాం మార్చాడు. అక్కడ ఓ అద్దె ఇంట్లో ఉండటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ప్రభాకర్ మిగిలిన నలుగురితో కలిసి విషపూరిత పామును సేకరించాడు. దీంతో మానసికి స్థితి బాగోలేని వ్యక్తిని పాము కాటేసేలా చేశారు.

   ఇది చదవండి : చేసేది దొంగతనం..బిల్డప్ మాత్రం బిజినెస్.. గ్రామాల్లో రోడ్లు.. పదిమంది లవర్స్.. ఇంకా చాలానే..


  అతడు చనిపోయాడని నిర్దారించుకున్న తర్వాత ఆస్పత్రికి తరలించారు.ఆసుపత్రిలో చనిపోయింది ప్రభాకర్‌గా చెప్పారు.. మిగిలిన వారు తమను తాము ప్రభాకర్ బంధువులుగా చెప్పుకున్నారు. మృతుడి పేరును ప్రభాకర్ వాఘ్‌చౌరేగా నమోదు చేయించారు. బాధితుడు అమెరికాలో ఉండేవాడని.. కొద్ది నెలల క్రితం ఇండియాకు వచ్చాడని అధికారులకు తెలిపారు. ఆ తర్వాత మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు, ఇన్సురెన్స్ క్లెయిమ్ చేయడానికి అవసరమైన చట్టపరమైన పత్రాలను కూడా సేకరించారు. తర్వాత చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అనంతరం వాటిని అమెరికాలోని ప్రభాకర్ కొడుకుకు పంపడంతో అతడు బీమా డబ్బులు కోసం దరఖాస్తు చేశాడు.

  అయితే గతంలో కూడా ప్రభాకర్ తమను మోసం చేసేందుకు యత్నించిన విషయాన్ని గుర్తుచేసుకున్న అమెరికన్ సంస్థ.. ఇన్సురెన్స్ క్లెయిమ్ విషయంలో అనుమానపడింది. క్లెయిమ్‌కు సంబంధించి ధ్రువీకరణ కోసం తమ టీమ్‌ను ఇండియాకు పంపింది. దీంతో ఇండియా చేరుకున్న వారు పోలీసులను సంప్రదించారు. దీంతో విచారణ జరపగా ప్రభాకర్ కుట్ర మొత్తం బయటపడింది.

  దీంతో పోలీసులు ప్రభాకర్ కోసం గాలింపు చేపట్టారు. చివరకు గుజరాత్‌లో వడోదరాలో అతడిని అరెస్ట్ చేశారు. అతనితో పాటు మిగిలిన నలుగురు నిందితులపై ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు.
  Published by:yveerash yveerash
  First published: