Inspiring: చిత్తూరు కుర్రాడు... 8 మంది ప్రాణాలు కాపాడాడు... అది కూడా అర్థరాత్రి వేళ...

చిత్తూరు కుర్రాడు... 8 మంది ప్రాణాలు కాపాడాడు... అది కూడా అర్థరాత్రి వేళ... (symbolic image)

Inspiring: ఓ మంచి సినిమా చూసినప్పుడు మన మనసులో ఏదో ఆనందం కలుగుతుంది. ఓ మంచి రియల్ లైఫ్ స్టోరీ తెలుసుకున్నప్పుడూ అదే ఫీల్ కలుగుతుంది. అలాంటి ఓ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం.

  • Share this:
    వరుణ్ కుమార్... ఆంధ్రప్రదేశ్‌... చిత్తూరు కుర్రాడు. బెంగళూరులో... ఫార్మా వ్యాపారంచేస్తున్నాడు. మే 6న ఓ ఆస్పత్రి నుంచి ట్విట్టర్‌లో SOS వచ్చింది. అప్పుడు టైమ్ అర్థరాత్రి 1.30 అయ్యింది. ఆ ఆస్పత్రిలో కరోనా పేషెంట్లకు మెడికల్ ఆక్సిజన్ ఉన్నదంతా అయిపోయింది. 8 మంది పేషెంట్లు ఆక్సిజన్ సపోర్టుతో ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. ఉన్న కాస్త ఆక్సిజన్... మరో 90 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత.......... వెంటనే అరుణ్... ఆస్పత్రికి కాల్ చేశాడు. నిజమేనా అని అడిగాడు. ఎస్ అంటూ... అటు నుంచి తడారిన గొంతు సమాధానం. అంతే... వరుణ్... యాక్షన్ లోకి దిగాడు. వెంటనే తన కాంటాక్ట్స్ లిస్టులోని వారికి కాల్స్ చేశాడు. సిటీ పోలీస్ కమిషనర్ కమల్ పంత్‌కి కూడా కాల్ చేసి... పరిస్థితిని వివరించాడు.

    "అధికారులకు విషయం చెప్పినట్లు కమిషనర్ నాకు చెప్పారు. అంతేకాదు... అసిస్టెంట్ పోలీస్ కమిషనర్‌ (ACP) అజయ్ కుమార్‌ని కాంటాక్ట్ అవ్వమన్నారు. మరోవైపు ఆస్పత్రికి చెందిన ఆక్సిజన్ నింపుకోవాల్సిన వాహనాలు ఫిల్లింగ్ స్టేషన్ దగ్గరే ఉన్నాయి. పీన్యా ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ క్యూ ఉంది. తాము ఆక్సిజన్ నింపుకునే సరికి తెల్లారుతుందని వాహనాల డ్రైవర్లు చెప్పారు." అని వరుణ్ తెలిపాడు.

    వరుణ్ నుంచి రిక్వెస్ట్ రాగానే... ACP... స్పందించారు. వెంటనే ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర... ఆస్పత్రి వాహనాలకు ముందుగా ఆక్సిజన్ నింపేలా చెయ్యమని స్థానిక పోలీసులను ఆదేశించారు. అంతేకాదు... ఆక్సిజన్ ఫిల్లింగ్ స్టేషన్‌కి ACP కాల్ చేసి మాట్లాడారు. దాంతో ఫిల్లింగ్ స్టేషన్ వారు... "ఓకే సార్... ముందు... ఆస్పత్రి వెహికిల్స్‌కే నింపుతాం" అని హామీ ఇచ్చారు.

    టైమ్ పరుగెడుతోంది. ఈ సమయంలో... వరుణ్... అటు ఆస్పత్రి వర్గాలు, ఇటు ఫిల్లింగ్ స్టేషన్ వర్గాలతో టచ్‌లో ఉంటూ... ఎప్పటికప్పుడు సమాచారం అటూ ఇటూ చేరవేస్తున్నాడు. ఆ తర్వాత శరవేగంగా ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర ఆక్సిజన్ నింపడం... ఆ వాహనాలు ఆస్పత్రికి వెళ్లడం... వెంటనే పేషెంట్లకు ఆక్సిజన్ గ్యాప్ లేకుండా చెయ్యడం అన్నీ జరిగాయి. అలా... వరుణ్ చొరవతో... 8 మంది పేషెంట్ల ప్రాణాలు నిలిచాయి.

    గతేడాది అలా జరిగింది:
    2020లో లాక్‌డౌన్ ఉన్నప్పుడు... వరుణ్‌కి ఆశ్చర్యపోయే ఘటన ఒకటి జరిగింది. అది అతని మనసుని కదిలించింది. ఓ వలస కూలీ... అతని కారు విండోని కొట్టాడు. ఆహారం అడిగాడు. అంతే కారులోని వరుణ్ ఆ క్షణం నుంచి మారిపోయాడు. అప్పటి నుంచి చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడి... వారి సాయంతో... రోజూ కొంతమందికి ఉచితంగా భోజనాలు పెట్టడం మొదలుపెట్టాడు. కానీ ఇవేవీ సరిపోవు అనుకున్నాడు. ఓ అపార్ట్‌మెంట్ కొనేందుకు అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.5 లక్షలు వెనక్కి తీసుకొని ఖర్చు పెట్టాలని అనుకున్నాడు. అదే చేశాడు. లాక్‌డౌన్ సమయంలో మొత్తం 12000 వలస కూలీలకు ఆహారం పెట్టాడు. అంతేకాదు... 5000 డ్రై రేషన్ కిట్లు అవసరమైన వారికి ఇచ్చాడు. ఫలితంగా వందల మంది ఆకలి చావుల నుంచి బయటపడ్డారు.

    ఈ సంవత్సరం... కరోనా వరుణ్‌ని కూడా పట్టుకుంది. దాన్ని వదిలించుకున్నాడు. మళ్లీ యాక్షన్‌లోకి దిగి... బెడ్లు లేని వారికి... అవి వెతికి పెడుతున్నాడు. అలాగే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా SOS కాల్స్ అందుకుంటూ... సాయం చేస్తున్నాడు. చిత్తూరులో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కి మెడికల్ కిట్స్, ఇతరత్రా అవసరమైనవాటిని పంచాడు. ఇంత చేసినా... తాను చేసింది ఏమీ లేదు అంటున్నాడు. రోజూ 300కు పైగా SOS కాల్స్... వరుణ్‌కి వస్తున్నాయి. వాటిలో ఎక్కువ శాతం పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులవే. రోజులో ఎక్కువ సమయం... ఈ కాల్స్ అందుకోవడం, పేదవారికి సాయం చేయడంతోనే సరిపోతోంది.

    ఇది కూడా చదవండి: Black Fungus: బ్లాక్ ఫంగస్ కేసులు పెరగడానికి అదే కారణమా... జరుగుతున్న పరిశోధన

    ఇలా వరుణ్ నిజమైన వారియర్‌గా నిలుస్తున్నాడు. ఇలాంటి వాళ్లను చూసినప్పుడైనా కరోనా సిగ్గుతో చచ్చిపోవాలి. అవునా కాదా...
    Published by:Krishna Kumar N
    First published: