ఉగ్ర కుట్ర భగ్నం : కేరళలో శ్రీలంక తరహా దాడులకు ప్లాన్

ఈస్టర్ సండే రోజు శ్రీలంకలో జరిగిన పేలుళ్లలో 250 పైచిలుకు మంది గాయపడగా.. 500 పైచిలుకు మంది గాయపడ్డారు. ఘటన అనంతరం ఐసిస్(ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్&సిరియా) ఇది తమ చర్యే అని ప్రకటించింది.

news18-telugu
Updated: April 30, 2019, 6:56 AM IST
ఉగ్ర కుట్ర భగ్నం : కేరళలో శ్రీలంక తరహా దాడులకు ప్లాన్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 30, 2019, 6:56 AM IST
శ్రీలంక మారణహోమాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఓ యువకుడు భారత్‌లోనూ అలాంటి నరమేధాన్ని సృష్టించాలనుకన్నాడు. అయితే జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అప్రమత్తతో పెద్ద ప్రమాదం తప్పింది. భారత్‌లో శ్రీలంక తరహా ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేసిన రియాస్(29)ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. కేరళలోని కసర్‌గఢ్‌లో అతను ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేసినట్టు గుర్తించింది.

ఎన్ఐఏ అరెస్ట్ చేసిన రియాస్, అలియాస్ రియాస్ అబూబకర్, అలియాస్ అబూ దుజనా.. తాను జహ్రన్ హసీమ్ నుంచి స్ఫూర్తి పొందినట్టు విచారణలో వెల్లడించాడు.ఇటీవలి శ్రీలంక పేలుళ్ల సూత్రధారి అయిన జహ్రన్ హసీమ్ స్పీచ్‌లు, వీడియోలను ఏడాదికి పైగా ఫాలో అవుతున్నట్టు తెలిపాడు. అంతేకాదు, వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్ నాయక్ స్పీచ్‌‌లను కూడా అతను ఫాలో అవుతున్నట్టు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.

శ్రీలంకలో పేలుళ్ల తర్వాత భారత్‌లో ఉగ్ర కదలికలపై మరింత నిఘా పెట్టిన ఎన్ఐఏ.. కేరళ నుంచి పలువురు యువకులు ఐసిస్‌లో చేరడానికి వెళ్లారని గుర్తించింది. ఈ నేపథ్యంలో కేరళలోని పలు ఇళ్లపై దాడులు చేసి.. ఐసిస్‌తో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్నవారిని అదుపులోకి తీసుకుంది. విచారణలో వీరి నుంచి ఎటువంటి విషయాలు బయటపడుతాయో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా,ఈస్టర్ సండే రోజు శ్రీలంకలో జరిగిన పేలుళ్లలో 250 పైచిలుకు మంది గాయపడగా.. 500 పైచిలుకు మంది గాయపడ్డారు. ఘటన అనంతరం ఐసిస్(ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్&సిరియా) ఇది తమ చర్యే అని ప్రకటించింది.

First published: April 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...