హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

INS Visakhapatnam : బ్రహ్మోస్ సూపర్‌ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ని పరీక్షించిన INS విశాఖపట్నం

INS Visakhapatnam : బ్రహ్మోస్ సూపర్‌ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ని పరీక్షించిన INS విశాఖపట్నం

BrahMos supersonic cruise missile : భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక INS విశాఖపట్నం పశ్చిమ సముద్ర తీరంలో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించింది.

BrahMos supersonic cruise missile : భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక INS విశాఖపట్నం పశ్చిమ సముద్ర తీరంలో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించింది.

BrahMos supersonic cruise missile : భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక INS విశాఖపట్నం పశ్చిమ సముద్ర తీరంలో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించింది.

BrahMos supersonic cruise missile : భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక INS విశాఖపట్నం పశ్చిమ సముద్ర తీరంలో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించింది. ఈ మిసైల్ సముద్రతల పోరాటానికి సంబంధించినది. బ్రహ్మోస్... మధ్య పరిధి గల, ర్యామ్‌జెట్ ఇంజనుతో పనిచేసే సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించే క్రూయిజ్ క్షిపణి. నేలపై నుండి, సముద్రంపై నుండి (యుద్ధ నౌకల నుండి), సముద్రం లోపల నుండి (జలాంతర్గాముల నుండి)లేదా ఆకాశం నుండి (యుద్ధ విమానాల నుండి) ఈ క్షిపణిని ప్రయోగించవచ్చు. చైనా, పాక్‌ లతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో భారత్ ఈ పరీక్ష చేయడం గమనార్హం. కాగా,ఫిబ్రవరి 21న జరగనున్న రాష్ట్రపతి ఫ్లీట్‌ రివ్యూలో పాల్గొనేందుకు ఈ యుద్ధనౌక విశాఖపట్నం చేరుకుంది.

శత్రువులను ధైర్యంగా ఎదుర్కొవాలంటే ముందు మన శక్తిసామర్థ్యాలు ఎంత మేరకు ఉన్నాయో తెలిసి ఉండాలి. ఏ మేరకు పోరాడగలమో సమీక్షించుకోవాలి. అలా నౌకాదళ బలాన్ని సమీక్షించేదే ప్రెసిడెంట్‌ ప్లీట్‌ రివ్యూ. దేశ మెరైన్ అవసరాలకు అనుగుణంగా.. నౌకల నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు నౌకాదళం సన్నద్దంగా ఉండాల్సి ఉంటుంది. ఆ సన్నద్ధతను బేరీజు వేసుకునేందుకు ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ ఒక కొలమానంగా ఉంటుంది. అత్యంత చాకచక్యంగా వ్యవహరించడం, అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడం..మన సత్తా చాటి చెప్పడం..వంటి అంశాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. ఈనెల 21 నుంచి విశాఖ వేదికగా జరగనున్న ఈ ప్రెసిడెంట్‌ ప్లీట్‌ రివ్యూ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పాల్గొంటారు. విశాఖ రానున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు 20న సాయంత్రం నావల్‌ డాక్‌యార్డు వద్ద ఏపీ గవర్నర్‌ స్వాగతం పలకనున్నారు. 75 ఏళ్ళ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈ సారి ప్రెసిడెంట్ ప్లీట్‌ రివ్యూను దేశ సేవలో 75 ఏళ్లు అన్న నినాదంతో నిర్వహిస్తున్నారు. 60 నౌకలు, సబ్ మెరైన్లు, 50కి పైగా ఎయిర్ క్రాప్టులతో ముఖ్య విన్యాసాలు నిర్వహించనున్నారు. ప్రెసిడెంట్ ప్లీట్‌ రివ్యూలోని నౌకా విన్యాసాలను ఆర్కే బీచ్‌ నుంచి ప్రజలు సైతం వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.


మరోవైపు,రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేయడానికి డీఆర్‌డీవో వరసగా ప్రయోగాలు చేస్తోంది. పదునైనా అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. పర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఎయిర్ టు ఎయిర్ వేరియంట్‌ను ఒడిశా తీరంలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఇటీవల విజయవంతంగా ప్రయోగించారు. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ప్రళయ్‌‌ని కూడా విజయవంతంగా పరీక్షించారు. అలాగే అంతకుముందు చేసిన అగ్ని ప్రైమ్ క్షిపణి, అభ్యాస్‌ క్షిపణిల ప్రయోగాలు విజయవంతం అయ్యాయి.

First published:

Tags: Indian Navy, INS Visakha, Missile, Vizag

ఉత్తమ కథలు