జైళ్లో ఎంటర్‌టైన్‌మెంట్ : ఐపిఎల్ కోసం దీక్ష చేసిన ఖైదీలు

జైళ్లో ఎంటర్‌టైన్‌మెంట్ :  ఐపిఎల్ కోసం దీక్ష చేసిన ఖైదీలు

inmates strick

ఐపిఎల్ మ్యాచ్‌లను చూసే వెసులుబాటును కల్పించాలని ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌,ఫతేగఢ్ సెంట్రల్ జైలులోని ఖైదీలు నిరసన దీక్షకు దిగారు. తమకు మ్యాచ్‌లు చూసే అవకాశం కల్పించేవరకు టిఫిన్‌తో మానేసి నిరసన వ్యక్తం చేశారు.

  • Share this:
ఐపిఎల్ మ్యాచ్‌లు దేశంలో చాలమందికి క్రేజ్‌గా మారాయి. ముఖ్యంగా యువతకు క్రికెట్‌ను చూడకుండా ఉండని పరిస్థితి నెలకొంది..అయితే ఇధి సాధరణ ప్రజల నుండి జైళ్లో ఉండే ఖైదీలకు కూడ ఈ క్రేజ్ పాకింది. ఉన్నది జైలు అయినా..తామకు కూడ అన్ని హక్కులు ఉంటాయని, అందుకే తాము కూడ ఐపిఎల్ మ్యాచ్‌లు చూస్తామని తెగెసిన ఖైదీలు అధికారులకు ఈ విషయం చెప్పారు. అయినా ఐపిఎల్ ప్రారంభమైన వారికి మాత్రం మ్యాచ్‌లను చూసే అవకాశం కల్పించలేదు..

దీంతో తమకు ఐపిఎల్ మ్యాచ్‌లను చూసే వెసులుబాటును కల్పించాలని ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌,ఫతేగఢ్ సెంట్రల్ జైలులోని ఖైదీలు నిరసన దీక్షకు దిగారు. తమకు మ్యాచ్‌లు చూసే అవకాశం కల్పించేవరకు టిఫిన్‌తో మానేసి నిరసన వ్యక్తం చేశారు.దీంతో వెంటనే స్పందించిన జైలు సూపరిండెంట్ వెంటనే జైలుకు వచ్చి వారితో చర్చలు జరిపాడు. ఇంకేముంది సూపరిండెంట్ సానుకూలంగా స్పందించారు. వెంటనే మ్యాచ్‌లు చూసే వెసులుబాటును కల్పిస్తామని హామీ ఇచ్చాడు. దీంతో ఖైదీలు దీక్ష విరమించారు. మొత్తం జైళ్లో తమకు కావాల్సిన సౌకర్యాల కోసం అంటే ఆహారం ,వైద్య సేవలతో పాటు అధికారుల తీరుపై ఆందోళనలు నిర్వహించిన సంఘటనలు గతంలో చూశాము కాని, జైళ్లో ఎంటర్‌టైన్ మెంట్ కోసం నిరసన చేపట్టి తమ డిమాండ్‌ను సాధించుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Published by:yveerash yveerash
First published:

అగ్ర కథనాలు