గాయపడిన పులితో ఆటలా...వెంటపడి మరీ వేటాడిందిగా..

అప్పటి దాకా సైలెంట్‌గా ఉన్న చిరుత..ఒక్కసారిగా జనాలపై దూకి దాడిచేసింది. చిరుత పులి దాడిలోో పలువురికి గాయాలయ్యాయి.

news18-telugu
Updated: August 19, 2019, 6:26 PM IST
గాయపడిన పులితో ఆటలా...వెంటపడి మరీ వేటాడిందిగా..
చిరుత పులితో ఫొటోలు తీసుకుంటున్న జనం
  • Share this:
'' పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో..చూస్కో..! పులితో ఫొటో దిగాలనిపించిందనుకో కొంచైం రిస్కయినా పర్లేదు. ట్రై చేయొచ్చు. చనువు ఇచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం..వేటాడేస్తది.! '' ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయించిన యమదొంగ సినిమా డైలాగ్ ఇది. ఈ డైలాగ్ నిజ జీవితంలోనూ జరిగింది. ఆటలాడటం కాదు..ఫొటోోల కోసం ప్రయత్నిస్తేనే పంజా విసిరింది. చిరుతపులితో ఫొటో తీసుకునేందుకు ప్రయత్నించిన జనాలపై అది దాడి చేసింది. వెంటపడీ మరీ పంజా విసిరింది. పశ్చిమ బెంగాల్‌లో ఈ ఘటన జరిగింది.

అలిపుర్దోర్ ప్రాంతంలో గాయపడిన ఓ పులి రోడ్డు పక్కన పడుకుంది. గాయాలు కావడంతో కదల్లేని స్థితిలో అది కనిపించింది. ఇదే అదునుగా సెల్ఫీ రాయుళ్లు చెలరేగిపోయారు. ఫోన్ కెమెరాను చేతపట్టి పులితో సెల్ఫీలు తీసుకున్నారు. పెద్ద మొత్తంలో జనాలు గుమికూడి ఫొటోలు తీసుకునేందుకు ఎగపడ్డారు. దాంతో ఆ పులికి తిక్కరేగింది. అప్పటి దాకా సైలెంట్‌గా ఉన్న చిరుత..ఒక్కసారిగా జనాలపై దూకి దాడిచేసింది. చిరుత పులి దాడిలోో పలువురికి గాయాలయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చిరుతపులి దాడి దృశ్యాలు ఇక్కడ చూడండి:First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>