INFOSYS REAPPOINTS SALIL PAREKH AS CEO AND MD FOR THE NEXT 5 YEARS PVN
Infosys Reappoints Salil Parekh : ఇన్ఫోసిస్ సీఈవోగా మళ్లీ ఆయనే
ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్
Infosys CEO : ఐఐటీ బాంబే నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన పరేఖ్ కు ఐటీ రంగంలో దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో ఈయన క్యాప్ జెమినీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా కూడా పని చేశారు. క్యాప్‌జెమినీలో 25 ఏండ్లపాటు వివిధ క్యాటగిరీల్లో నాయకత్వ పాత్ర పోషించిన ఆయన మెరుగైన పనితీరుతో సంస్థను లాభాల బాట పట్టించారు.
Infosys reappoints Salil Parekh:ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్(Infosys)సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ గా సలీల్ పరేఖ్ మరోసారి నియమితులయ్యారు. సలీల్ పరేఖ్ ను మరో ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. కొత్త సీఈఓ అండ్ ఎండీ నియామకాన్ని ఇన్ఫోసిస్ ఉన్నతాధికారులు ఎక్స్చేంజ్లకు తెలియజేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువరించింది. ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కం మేనేజింగ్ డైరెక్టర్ గా సలీల్ పరేఖ్ 2027 మార్చి 31 వరకు కొనసాగుతారని ఇన్ఫోసిస్ అధికారికంగా ప్రకటించిన ప్రచురణ పత్రంలో పేర్కొంది. కేవలం అర్హత ఆధారంగానే ఈ నియామకాన్ని చేపట్టినట్లు వెల్లడించింది. ఈయనకు ఎవరి అండదండలు లేవని స్పష్టం చేసింది. ఇన్ఫోసిస్‌ను మరింత విజయవంతంగా నడిపించే శక్తి సామర్థ్యాలు ఉన్నందుకే ఆయన్ని ఎంపిక చేసినట్లు వెల్లడించింది.
సలీల్ పరేఖ్ గత నాలుగేండ్లుగా ఇన్ఫోసిస్ సీఈవో కం ఎండీగా కొనసాగుతున్నారు. సలీల్ పరేఖ్ 2018 జనవరి నుంచి ఇన్ఫోసిస్ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సంస్థను లాభాల బాట పట్టించడంలో తనదైన పాత్ర పోషించారు. అటు మేనేజ్మెంట్కు ఇటు ఉద్యోగులకు మధ్య సంధాన కర్తగా ఉండడంతో మెరుగైన ఫలితాలు సాధించారు.
ఐఐటీ బాంబే నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన పరేఖ్ కు ఐటీ రంగంలో దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో ఈయన క్యాప్ జెమినీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా కూడా పని చేశారు. క్యాప్‌జెమినీలో 25 ఏండ్లపాటు వివిధ క్యాటగిరీల్లో నాయకత్వ పాత్ర పోషించిన ఆయన మెరుగైన పనితీరుతో సంస్థను లాభాల బాట పట్టించారు. ఆతర్వాత ఇన్ఫోసిస్‌లో చేరి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.