హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఈయన ఒక్క రూపాయికే చదువు చెబుతారు.. ఇప్పటి వరకు 5వేల మందికి విద్య

ఈయన ఒక్క రూపాయికే చదువు చెబుతారు.. ఇప్పటి వరకు 5వేల మందికి విద్య

మనీష్ సింగ్ గుర్జార్

మనీష్ సింగ్ గుర్జార్

డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకున్న యువతకు కూడా మానసిక స్ధైర్యానిస్తున్నారు మనీష్. ఇండోర్, ఢిల్లీ, ఉజ్జయిని, దేవాస్, భోపాల్, రత్లాం, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లి కౌన్సెలింగ్ ద్వారా 100 మందికి పైగా యువతను డ్రగ్స్ నుంచి విముక్తి కల్పించారు.

ఇంకా చదవండి ...
  • Local18
  • Last Updated :
  • Hyderabad, India

ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా.. కొత్త కోర్సు చదవాలన్నా.. ఇన్‌స్టిట్యూట్‌లు వేలకు వేలు డబ్బ వసూలు చేస్తాయి. కానీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్త మాత్రం ఒక్క రూపాయికే చదువు చెబుతాడు. ఇంగ్లీష్‌తో పాటు ఇతర అంశాలలూ బోధిస్తారు. ఆయన పేరు మనీష్ సింగ్ గుర్జార్. వృత్తిరీత్యా డాక్టర్. గత పదేళ్లుగా పేద పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్‌లు చెబుతున్నారు. అందుకు రోజుకు ఒక్కరూపాయి అంటే.. నెలకు రూ.30 మాత్రమే ఫీజుగా తీసుకుంటారు. పేద పిల్ల విద్య, ఆరోగ్యం కోసం ఈయన అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 5000 మంది పిల్లలకు రోజుకు రూపాయి చొప్పున విద్యను అందించారు. పలు జిల్లాల్లో కెరీర్ కౌన్సెలింగ్, మోటివేషనల్ సెమినార్లు తీసుకున్నారు.

Rashtrapathi Bhawan: మన దేశంలో రెండో రాష్ట్రపతి భవన్.. ఇక్కడ డాక్టర్ రాజేంద్ర ప్రసాదే దేవుడు..!

చదువుకు డబ్బులు లేని పిల్లలను ఎంచుకొని.. వారికి తరగతులను నిర్వహిస్తారు మనీష్. ఉన్నత చదువులు చదివేలా చైతన్య పరుస్తూ.. వెన్నంటి ప్రోత్సహిస్తున్నారు. ఇండోర్‌లో చాలా చోట్ల స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులతో పాటు ఉచిత ఆరోగ్య శిబిరాలు, ఉచిత విద్యా శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి ప్రభుత్వ సాయం, రాజకీయ సాయం లేకుండానే ఈ పనులన్నీ ఆయన తన సొంత ఖర్చులతో చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాలను మరింత పెద్ద ఎత్తులన చేపట్టాలనే యెచనలో ఉన్నట్లు ఆయన చెప్పారు. మెడిసిన్ చదువుతున్న 10 మంది విద్యార్థులతో కలిసి మెడికో ఎడ్యుకేషన్ పేరిట ఓ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఆ గ్రూప్ ద్వారా నెలకు రూ.30కి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు ఇవ్వడం ప్రారంభించారు.

Navy Helicopter : సముద్రంలో నేవీ హెలికాప్టర్ క్రాష్!..తర్వాత ఏమైందంటే.

ఇప్పటి వరకు రాష్ట్రంలోని దాదాపు 10 జిల్లాల్లోని వివిధ గ్రామాలకు వెళ్లి పిల్లలకు ఆంగ్ల భాషను నేర్పించారు డాక్టర్ మనీష్ సింగ్ గుర్జార్. 2010లో కాల్ సెంటర్‌ ఇంటర్వ్యూకి వెళ్లానని.. అందులో సెలెక్ట్ అయ్యానని.. కానీ చాలా మంది ఇంగ్లీషు రానందు వల్లే సెలెక్ట్ కాలేదని చెప్పారు. ఇలాంటి పేదవాళ్ళకి ఇంగ్లీషు నేర్పాలని అప్పుడు నిర్ణయించుకున్నట్లు తెలిపారు.. డాక్టర్ గుర్జార్ ఇప్పటివరకు ఐదు వేల మంది పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించారు. అంతేకాదు 200 మంది పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించారు. కరోనా కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 15 ఉచిత శిబిరాలను కూడా ఆయన నిర్వహించారు.

డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకున్న యువతకు కూడా మానసిక స్ధైర్యానిస్తున్నారు మనీష్. ఇండోర్, ఢిల్లీ , ఉజ్జయిని, దేవాస్, భోపాల్, రత్లాం, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లి కౌన్సెలింగ్ ద్వారా 100 మందికి పైగా యువతను డ్రగ్స్ నుంచి విముక్తి కల్పించారు. ఆత్మహత్య ఆలోచనలు, మాదకద్రవ్యాల సంబంధిత సమస్యల కోసం ప్రతి ఆదివారం నాలుగు గంటల పాటు ఉచిత ఆన్‌లైన్ OPD కౌన్సెలింగ్‌ను కూడా అందజేస్తున్నారు. ఈ కౌన్సెలింగ్ అవసరమైన వారు 9399429889కి ఫోన్ చేసి సంప్రదించవచ్చు.

First published:

Tags: EDUCATION, Madhya pradesh

ఉత్తమ కథలు