భారత రక్షణ దళాల్లో ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP- Indo-Tibetan Border Police)కు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఒక ప్రత్యేకమైన విభాగం. ఈ విభాగంలో దాదాపు 90,000 మందికి పైగా జవాన్లు, అధికారులు పని చేస్తున్నారు. నక్సల్స్(Naxals) ప్రభావిత ప్రాంతాల్లో మోహరింపు, శాంతిభద్రతల పరిరక్షణ విధులతోపాటు హిమాలయ(Himalaya) సరిహద్దులను రక్షించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దేశ రక్షణకు విశిష్ట సేవలు అందిస్తున్నారు. అత్యంత నైపుణ్యం కలిగిన సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (CAPF) ఈ దళంలో ఉంటారు. ప్రమాదకర, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో.. ఎక్కువగా హిమాలయాలలో 3,000 నుంచి 18,800 అడుగుల ఎత్తులో సరిహద్దు రక్షణ విధులు నిర్వర్తిస్తారు. ఇక్కడ ఉష్ణోగ్రత -45 డిగ్రీల వరకు పడిపోతుంది.
కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఈ జవాన్లు శిక్షణ పొందారు. చైనా(China) దురాక్రమణను తిప్పికొట్టడం నుంచి చమోలీలోని సొరంగం నుంచి ప్రజలను రక్షించడం వరకు ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీసులు ఏదైనా చేయగలరు. 'శౌర్య-దృఢత-కర్మనిష్ఠ' (శౌర్యం- నిర్ణయం- విధులపై భక్తి) అనే నినాదానికి అనుగుణంగా ఈ జవాన్లు పని చేస్తారు. మానవుల గౌరవం, జాతీయ సమగ్రతను కాపాడటం వీరి ప్రధాన లక్ష్యం. దీనిని 'హిమాలయాల సెంటినెల్స్'గా వ్యవహరిస్తారు.
ALSO READ Pakistan Crisis: పాకిస్తాన్‌లో మళ్లీ స్వాతంత్ర్య పోరాటం.. Imran Khan సంచలన పిలుపు..
చరిత్ర
‘ఒక సరిహద్దు, ఒకే శక్తి’ విధానాన్ని అనుసరించి, 1962లో చైనా దురాక్రమణ తర్వాత భారత ప్రభుత్వం హిమాలయ సరిహద్దులను కాపాడేందుకు ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చివరగా ITBP 1962న అక్టోబరు 24 నాలుగు బెటాలియన్‌లతో ప్రారంభమైంది. స్థానికులతో కలిసిపోవడానికి, సమాచారం సేకరించడానికి, శత్రువుల చొరబాటును గుర్తించేందుకు ఈ దళం ఉన్నత స్థాయి శిక్షణ పొందింది. శత్రువులు ఆక్రమించిన ఏ ప్రాంతం నుంచి అయినా వారిని తరిమికొట్టడానికి గెరిల్లా యోధులుగా పని చేయాల్సి ఉంటుంది. ప్రారంభంలో ఈ ఫోర్స్‌లో వివిధ యూనిట్ల నుంచి 1,472 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. వీటిని నాలుగు బెటాలియన్‌లుగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం దీనిని విస్తరించాలని నిర్ణయించింది. కొండ ప్రాంతాలలో పర్యావరణంపై స్థానికులకు పూర్తి అవగాహన ఉన్నందున వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. చివరగా 1965, 1971లో జరిగిన ఇండో-పాక్ సంఘర్షణల సమయంలో జమ్ము, కశ్మీర్ ఎదురుతిరుగుబాటులో బలగాలు పాల్గొన్నాయి.
కేంద్ర ప్రభుత్వం 1978లో తొమ్మిది సర్వీస్ బెటాలియన్లు, నాలుగు స్పెషలిస్ట్ బెటాలియన్లు, రెండు శిక్షణా కేంద్రాలను కలిగి ఉండేలా దళాన్ని పునర్నిర్మించింది. 'ఒకే సరిహద్దు, ఒకే శక్తి కి కట్టుబడి ఉండాలని మంత్రుల బృందం సిఫార్సుల ప్రకారం.. జమ్ము కశ్మీర్‌లోని కారకోరం పాస్ నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని జాచెప్‌లా వరకు 3,488 కి.మీ. ITBP ఉంది. ప్రస్తుతం దళంలో 56 బెటాలియన్లు, 176 సరిహద్దు అవుట్‌పోస్టులు ఉన్నాయి.
* బలాలు, విధానాలు
ప్రస్తుతం ITBPలో 56 సర్వీస్ బెటాలియన్లు, నాలుగు స్పెషలిస్ట్ బెటాలియన్లు, 17 శిక్షణా కేంద్రాలు, 15 సెక్టార్ హెడ్‌క్వార్టర్‌లు, ఏడు లాజిస్టిక్స్ స్థాపనలు మొత్తం సుమారు 90,000 మంది సిబ్బంది ఉన్నాయి. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్(డీఐజీలు) కాకుండా ముగ్గురు అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీలు), 23 ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీలు) ఉంటారు. డైరక్టర్ జనరల్- ర్యాంక్ ఐపీఎస్ అధికారి ఈ దళానికి నాయకత్వం వహిస్తారు.
స్టోరీస్ ఆఫ్ వాలర్
1965 ఇండో-పాక్ యుద్ధంలో ITBP కీలక పాత్ర పోషించింది. పాకిస్థాన్ చొరబాటుదారులను తొలగించింది. రాజౌరి జిల్లాలోని(J&K) అనేక ప్రాంతాలలో స్థానిక ప్రజలను రక్షించింది. ఐటీబీపీ కృషి వల్లే గూల్‌లోని పోలీస్‌స్టేషన్ పాక్ చొరబాటుదారుల చేతుల్లోకి వెళ్లలేదు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో, పశ్చిమ ఫ్రంట్‌లోని థియేటర్ ఆఫ్ వార్‌లో రెండు బెటాలియన్‌లను చేర్చడానికి ITBP బాధ్యత వహించింది. పగలు, రాత్రి పెట్రోలింగ్ చేస్తూ పాక్ చొరబాటుదారులను విజయవంతంగా నిలువరించింది. 1981-82 లో 9వ ఆసియా క్రీడల సమయంలో ఘనమైన ప్రదర్శన తర్వాత, ప్రభుత్వం CHOGM-1983, NAM-1983 సమయంలో యాంటీ-టెర్రరిస్ట్ సెక్యూరిటీ కవరేజీని అందించడానికి భారతదేశం ITBPకి బాధ్యతను అప్పగించింది.
ALSO READ Sri Lanka Crisis : ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంక బయటపడాలంటే..అదొక్కటే దారి
శిక్షణ
ITBP పుట్టుక గెరిల్లా యుద్ధ శిక్షణతో ముడిపడి ఉంది. దీని భావన, శిక్షణ, నైపుణ్యం చాలా భిన్నంగా ఉంటాయి. సైనిక, పోలీసు వ్యూహం శిక్షణతో పాటు, పర్వత యుద్ధం, రాక్, మంచు క్రాఫ్ట్, ముఖ్యంగా నిరాయుధ పోరాటంలో శిక్షణ ఇస్తుంది. అధిక-ఎత్తులో మనుగడ, రేంజర్లు, స్కీయింగ్, రాఫ్టింగ్ మొదలైనవి, ITBP కలిగి ఉన్న కొన్ని ప్రధాన నైపుణ్యాలు.
* బడ్జెట్
2020-21 లో ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీబీపీ వార్షిక బడ్జెట్ రూ. 6,150.15 కోట్లు, 2021-2022 లో రూ.6,567.17 కోట్లు, 2022-2023 లో రూ.7,461.28 కోట్లు.
* ITBP 2.0
వచ్చే ఐదేళ్లలో ఐటీబీపీ తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ మోహరింపు కోసం దాదాపు ఏడు బెటాలియన్లు త్వరలో మంజూరు కానున్నాయి. ఇందులో 2030 నాటికి లక్ష మందికి పైగా సిబ్బంది ఉంటారు. ITBP రాబోయే 10 సంవత్సరాలలో అత్యుత్తమ CAPF లలో ఒకటిగా మారవచ్చని అధికారులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, China, Itbp, Pakistan, Police force