ఇండిగో విమానంలో ప్రయాణికులు బంధీ... దర్యాప్తుకి ఆదేశించిన DGCA

Mumbai Airport : విమానంలో ప్రయాణికుల్ని బలవంతంగా ఎందుకు ఉంచారు? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఏం జరిగింది? తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 5, 2019, 1:57 PM IST
ఇండిగో విమానంలో ప్రయాణికులు బంధీ... దర్యాప్తుకి ఆదేశించిన DGCA
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ముంబై నుంచీ జైపూర్ వెళ్లిన ఇండిగో విమానం... బుధవారం రాత్రంతా ముంబై ఎయిర్‌పోర్టులో ఉంది. అందులో ప్రయాణికుల్ని అలాగే ఉంచింది. ఎంతసేపైనా, ఎన్ని గంటలైనా ప్రయాణికుల్ని మాత్రం కిందకు దిగవద్దని ఫ్లైట్ ఇంజినీర్లు ఆదేశించారు. నిజానికి ముంబైలో భారీ వర్షాల కారణంగా... ఇండిగో సంస్థ... చాలా ఫ్లైట్ సర్వీసుల్ని రద్దు చేసింది. దాదాపు 20 విమాన సర్వీసులు ఆగిపోయాయి. ఆ క్రమంలో... జైపూర్‌లో బుధవారం రాత్రి 7.55కి దిగాల్సిన విమానం... ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచీ టేకాఫ్ అవ్వలేదు. రాత్రంతా విమానంలోనే ప్రయాణికులు ఉండిపోయారు. ఉదయం 6 గంటలకు ముంబై నుంచీ బయల్దేరి... ఉదయం 8 గంటలకు జైపూర్ విమానాశ్రయంలో దిగింది. ఐతే... తమను రాత్రంతా విమానంలో ఎందుకు ఉంచేశారని ప్రయాణికులు మండిపడుతున్నారు. తమకు కనీసం భోజనం పెట్టలేదనీ... తమను విమానం దిగనిస్తే... ఎయిర్‌పోర్ట్‌లో డిన్నర్ చేసేవాళ్లమని కొందరు ప్రయాణికులు ఫైర్ అయ్యారు. మరికొందరు విమానంలో ఉంటూనే... సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)కి కాల్ చేశారు. విమానంలో తీవ్ర గందరగోళం తలెత్తింది.

ఈ మొత్తం ఘటనపై... DGCA ఉన్నతాధికారులు దర్యాప్తుకి ఆదేశించారు. ఇలా ఎందుకు జరిగిందో ఇండిగో నిర్వాహకులు వివరణ ఇవ్వాలని కోరారు. అలాగే... బుధవారం ఎన్ని విమానాల్ని రద్దు చేసిందీ చెప్పాలని ఆదేశించారు. దీనిపై ఇండిగో నుంచీ ఇంకా సమాధానం రాలేదు.

First published: September 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు